Monday, December 23, 2024

గుజరాత్‌లో ఆప్ స్టార్ క్యాంపైనర్ల జాబితాలో కేజ్రీవాల్, భార్య సునీత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం గుజరాత్ స్టార్ క్యాంపైనర్ల జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం విడుదల చేసింది. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, పార్టీ నేతలు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆప్‌రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా సందీప్ పాఠక్ తదితర 40 మంది పేర్లు ఉన్నాయి.

మరో ఇద్దరు ఎంపీలు హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్ పేర్లు ఈ జాబితాలో లేవు. కేజ్రీవాల్‌తోపాటు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వీరంతా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జాబితాను పార్టీ ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది. గుజరాత్‌లో మొత్తం 26 లోక్‌సభ స్థానాలుండగా, కాంగ్రెస్ 24 స్థానాల్లో పోటీ చేస్తోంది. భరూచ్ స్థానం నుంచి చైతర్ వాసవ , భావ్‌నగర్ నుంచి ఉమేష్ మక్వానా ఆప్ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News