Wednesday, January 22, 2025

ఆప్ సత్యేంద్ర జైన్ రూ. 7 కోట్ల లంచం తీసుకున్నారు

- Advertisement -
- Advertisement -

ఎసిబి దర్యాప్తునకు ఎల్‌జి ఆదేశం

న్యూఢిల్లీ : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి) వికె సక్సేనా మంజూరు చేశారు. అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ఈ దర్యాప్తు జరుపుతుంది. ఎల్‌జి ఉత్తర్వు ప్రకారం, ఆప్ నేత సత్యేంద్రపై అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తు జరుగుతుంది. బెల్‌కు విధించిన రూ. 16 కోట్ల పెనాల్టీని మాఫీ చేయడానికి ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ సదరు లంచం తీసుకున్నారు.

ఢిల్లీలో 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిసిటివిల ఏర్పాటు ప్రాజెక్టును బెల్ ఆ సమయంలో చేపట్టింది. ప్రాజెక్టు విలువ రూ. 571 కోట్లు. ‘ఎసిబితో జైన్‌పై దర్యాప్తును ఆమోదించే నిమిత్తం 1998 అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఎ కింద ఈ వ్యవహారాన్ని కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖకు నివేదించాలన్న నిఘా, అవినీతి నిరోధక డైరెక్టరేట్ (డివిఎసి) ప్రతిపాదనను ఎల్‌జి అంగీకరించారు’ అని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఒక అధికార ప్రకటనలో తెలియజేసింది. అయితే, సత్యేంద్ర జైన్‌పై ఆరోపణలు తప్పుడివిగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తోసిపుచ్చింది. జైన్‌పై దర్యాప్తుపై ఆప్ మంత్రి ఆతిశీ స్పందిస్తూ, బిజెపి‘ఢిల్లీ ప్రభుత్వంపై కుట్ర పన్నుతోంది’ అని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News