Sunday, January 19, 2025

ఆప్ సోషల్ మీడియా డిపి ప్రచారం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలకు పిలుపు

న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు తమను బలపరచాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సోమవారం సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది. ఆమ్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మంత్రి అతిషి సోమవారం సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభిస్తూ ప్రజలు ఇందులో చేరాలని విజ్ఞప్తి చేశారు. ఆప్ నాయకులు, కార్యకర్తలు తమ ఎక్స్, ఫేస్‌బుక్, వాట్సాప్, తదితర సోషల్ మీడియా అకౌంట్లలో తమ డిస్‌ప్తే పిక్చర్(డిపి)లను మారుస్తారని, తమ ఫోటోలకు బదులుగా జైలు గోడలలో బందీగా ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫోటోను పెట్టి మోడీ కా సబ్సే బడా డర్ కేజ్రీవాల్(మోడీకి కేజ్రీవాల్ అంటే భయం) అన్న క్యాప్షన్ రాస్తారని ఆమె తెలిపారు.

దేశంలో ప్రధాని నరేంద్ర మోడీని సవాలు చేయగల సత్తా ఉన్న ఏకైక నాయకుడు కేజ్రీవాల్ అని ఆమె అన్నారు. అందుకే ఎటువంటి ఆధారాలు లేన్పటికీ లోక్‌సభ ఎన్నికల ప్రకటన తర్వాత కేజ్రీవాల్‌ను ఇడి అరెస్టు చేసిందని ఆమె తెలిపారు. ఎకైజ్ కుంభకోణంలో రెండేళ్ల పాటు దర్యాప్తు జరిపిన ఇడి ఒక్క పైసా సాక్షాన్ని కూడా చూపెట్టలేకపోయిందని ఆమె విమర్శించారు. కేజ్రీవాల్‌ను అణచివేయాలని బిజెపి, మోడీ కోరుకుంటున్నారని, దేశంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా ఆప్ పోరటం సాగిస్తున్నారని అతిషి చెప్పారు. తాము ప్రారంభించిన సోషల్ మీడియా డిపి క్యాంపెయిన్‌లో పాల్గొనవలసిందిగా ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలకు కూడా ఉందని ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News