Wednesday, January 22, 2025

“జైల్ కా జవాబ్ వోట్ సే” నినాదంతో ఆప్ ప్రచారం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆదివారం నాడు ఢిల్లీలో నిరాహార దీక్ష సాగించిన ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం “జైల్ కా జవాబ్ నోట్ సే” నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆప్ రాజ్యసభ సభ్యుడు సందీప్ పాథక్ మాట్లాడుతూ రాజకీయ కుట్రలో భాగంగా కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారని, ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడుపుతున్న నాయకుడిని లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారని తీవ్రంగా విమర్శించారు.

ఈ సమయంలో ప్రజలంతా కేజ్రీవాల్‌కు సంఘీభావం తెలియజేయడం కోసం జైల్ కా జవాబ్ వోట్ సే ప్రచారాన్ని ప్రారంభించామని వెల్లడించారు. ఈ ప్రచారంలో భాగంగా ఆప్ నేతలు, కార్యకర్తలు ఎక్కడైతే తమ అభ్యర్థులు పోటీకి నిల్చున్నారో ఆ నాలుగు నియోజక వర్గాల్లో ప్రచారం సాగిస్తారని చెప్పారు. ఓట్లతో నియంతృత్వానికి గుణపాఠం చెప్పాలని ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ ప్రజలను కోరారు. ఆప్ ఇంతవరకు న్యూఢిల్లీ, తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, పశ్చిమఢిల్లీల్లో తన అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది. మిగిలిన మూడు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News