Wednesday, January 22, 2025

ఆప్ తెలంగాణ ఇంఛార్జిగా దిలీప్ పాండే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలంగాణ బాధ్యులుగా ఢిల్లీ అసెంబ్లీ చీఫ్ విప్ దిలీప్ పాండేను నియమించినట్లు ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డా. దిడ్డి సుధాకర్ తెలిపారు. ఇందుకు ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దిలీప్ పాండే అన్నా హజారే ఉద్యమంలో పాల్గొన్నారని, ఆమ్ ఆద్మీ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారని తెలిపారు. 2014, జనవరిలో దిలీప్ పాండే దేశ రాజధానిలో రాజకీయ కార్యకలాపాలకు కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన జూలై 2014లో డిల్లీ యూనిట్ కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

ఆయన సహ-కన్వీనర్‌షిప్‌లో 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ 70 సీట్లకు 67 సీట్లు గెలుచుకుంది. 2017 ఎంసిడి ఎన్నికల్లో ఆప్ మెజారిటీని పొందడంలో విఫలమైన తర్వాత దిలీప్ పాండే ఏప్రిల్ 2017లో తన రాజీనామాను సమర్పించారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల కోసం ఢిల్లీలోని ఈశాన్య లోక్ సభ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌గా దిలీప్ నామినేట్ అయ్యారు . 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో తిమార్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపికి చెందిన సురీందర్ పాల్ సింగ్ (బిట్టూ)ని ఓడించారు. ఎంఎల్‌ఏ దిలీప్ పాండే మార్చి 2020లో ఢిల్లీ శాసనసభ లో చీఫ్ విప్‌గా నియమితులయ్యారు. దిలీప్ పాండే ఆద్వర్యంలో తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీని మరింత బలోపేతం చేస్తామని డా. సుధాకర్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News