Tuesday, December 24, 2024

గుజరాత్ ఎన్నికలతో ‘ఆప్’కు జాతీయ పార్టీ హోదా: సిసోడియా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ‘ఆమ్ ఆద్మీ పార్టీ’(ఆప్)ని జాతీయ స్థాయికి ఎదిగేలా చేస్తున్నాయని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా గురువారం తెలిపారు. “గుజరాత్ ఓట్లతో ‘ఆప్’ జాతీయ పార్టీ కాబోతున్నది. దేశంలో తొలిసారిగా విద్య, ఆరోగ్యం ఆధారంగా రాజకీయాలకు దేశంలో గుర్తింపు లభిస్తోంది. భారత దేశ ప్రజలకు అభినందనలు” అని సిసోడియా ట్వీట్ చేశారు.

తొలి ఓట్ల లెక్కింపులో ఆప్ 144 అసెంబ్లీ స్థానాల్లో ముందుండగా, కాంగ్రెస్ కేవలం 20 స్థానాల్లో ముందుండి చాలా వెనుకబడ్డది. ఆప్ తన తీవ్ర ప్రచారంతో గుజరాత్‌లో త్రికోణ పోటీని సృష్టించింది. ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వాలు రాష్ట్ర స్థాయి పార్టీ హోదాను స్థిరపరిచాయి. కాగా ఇప్పుడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దానికి జాతీయ పార్టీ హోదాను అందించబోతోంది. ఓ రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందాల్సి ఉంటుంది. అదే రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం రెండు సీట్లు గెలవాలి, ఆరు సీట్లు సాధించాల్సి ఉంటుంది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత, ఆప్ పార్టీ ఢిల్లీ, పంజాబ్, గోవా, గుజరాత్ రాష్ట్రాలలో…అంటే నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందుతుంది. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ స్థాయి పార్టీ స్థాయికి ఎదగనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News