Saturday, December 28, 2024

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఊడ్చేయనున్న ‘ఆప్’: ఎగ్జిట్ పోల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ దుమ్మురేపబోతోందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 250 వార్డులకు గాను ఆప్ 149 నుంచి 171 వార్డులు గెలుచుకునే అవకాశం ఉందని ‘ఇండియా టుడే’ యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. భారతీయ జనతా పార్టీకి 69 నుంచి 91 సీట్లు దక్కే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ దారుణంగా చతికిలపడింది. 3 నుంచి 7 స్థానాలు దక్కే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఇతరులు 5 నుంచి 9 వార్డుల్లో గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది. ఇవి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రమే. వాస్తవ ఫలితాలు ఈ నెల 7న విడుదల అవుతాయి.

ఈ నెల 4న జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. 250 వార్డులున్న ఎంసీడీలో మొత్తం 1349 మంది అభ్యర్థులు బరిలో నిలవగా వీరిలో 709 మంది మహిళలున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ఈసి అధికారులు 13,638 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 1.45 కోట్ల మంది. ఈస్ట్, సౌత్, నార్త్ మున్సిపల్ కార్పొరేషన్లను ఒక్క మున్సిపల్ కార్పొరేషన్‌గా (ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్) మార్చాక జరిగిన తొలి ఎన్నికలివి. ఈవిఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించారు. 40 వేల మంది పోలీసులు, 20 వేల మంది హోం గార్డులు, 108 కంపెనీల పారామిలిటరీ, రాష్ట్రాల పోలీస్ బలగాలు రక్షణ బాధ్యతల్లో నిర్వహించారు.

15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏలుతున్న బిజెపి మరోసారి అధికారంలోకి రావాలని యోచిస్తోంది. అనేక మురికివాడలను రెగ్యులరైజ్ చేయడం బిజెపికి ప్లస్ పాయింట్ కానుంది. ఎక్కడ గుడిసె ఉంటే అక్కడే పక్కా ఇల్లు కట్టుకోవచ్చనే ఫార్ములాను బిజెపి ప్రచారం చేసింది. 126 సీట్లు సాధిస్తే మ్యాజిక్ నెంబర్ సాధించినట్లే. బిజెపి స్టార్ క్యాంపెయినర్లను కూడా బరిలోకి దించి ప్రచారం చేసింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News