Saturday, December 21, 2024

అతిషికి విద్య, భరద్వాజ్‌కు ఆరోగ్య శాఖల కేటాయింపు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అతిషికి విద్య, సౌరభ్ భరద్వాజ్ చేత కొత్త మంత్రులుగా ఢిలీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా గురువారం ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష బిజెపి నాయకుడు రాంవీర్ సింగ్ బిధూర్ కూడా హాజరయ్యారు.

కాగా.. ఆతిషికి విద్య, పిడబ్లుడి, విద్యుత్, పర్యాటక శాఖలను, భరద్వాజ్‌కు ఆరోగ్య, పట్టణాభివృద్ధి, నీరు, పరిశ్రమల శాఖలను కేటాయించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మనీ లాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ అరెస్టయి జైలుపాలైన దరిమిలా ఢిల్లీ క్యాబినెట్‌లో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News