Monday, December 23, 2024

ఆనంద భాష్పాలు కార్చిన ఆతిషి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలిసీ స్కామ్ కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులలో మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.  దాంతో సంతోషం పట్టలేక ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన మంత్రి ఆతిషి కన్నీళ్లు పెట్టుకుంది.

‘‘ఢిల్లీ విద్యా విప్లవం’ తీసుకొచ్చిన మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం ఓ విజయం’’ అన్నారు. ‘‘నేడు సత్యం గెలిచింది. ఢిల్లీ విద్యార్థులు గెలిచారు.  ఆయన పేద పిల్లలకు మంచి విద్యను అందించినందుకు ఇన్నాళ్లు జైలు జీవితం గడిపారు’’ అని ఆతిషి భావోద్వేగంతో అన్నారు.

మనీశ్ సిసోడియా గత 17 నెలలుగా కస్టడీలో ఉన్నారు. అయినా ఆయనపై విచారణ ఇంత వరకు కొనసాగలేదు. వేగవంతమైన విచారణ కుంటుపడినట్లయిందని ధర్మాసనం న్యాయమూర్తులు బిఆర్. గవాయ్, కెవి. విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News