Monday, January 20, 2025

కేజ్రీవాల్ బెయిల్‌పై ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపేసిన ఢిల్లీ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

నిలదీసిన ఆప్ నేత సంజయ్ సింగ్

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు నిలిపివేసిన నేపథ్యంలో… ప్రధాని నరేంద్ర మోడీ న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని ఆప్ నేత సంజయ్ సింగ్ శుక్రవారం ఆరోపించారు.

‘ఎక్స్’ (ట్విట్టర్)  వేదికగా సంజయ్ సింగ్ ఓ పోస్ట్ పెట్టారు. అందులో ‘‘మోడీ ప్రభుత్వం గుండాయిజం చూడండి, విచారణ కోర్టు ఉత్తర్వు ఇంకా రాలేదు, ఆర్డర్ కాపీ కూడా రాలేదు.. మోడీ తాలూకు ఈడి మాత్రం హైకోర్టుకు చేరుకుంది. అయితే ఏ ఉత్తర్వును సవాలు చేయడానికి ఈడి హైకోర్టుకు చేరుకున్నట్టు? ’’ అని నిలదీశారు. ‘‘మోడీజీ మీరెందుకు న్యాయ వ్యవస్థను అబాసుపాలు చేస్తున్నారు? దేశమంతా మీ వ్యవహారం చూస్తోంది !’’ అని ఆప్ ఎంపీ పోస్ట్ లో పెట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News