Wednesday, January 22, 2025

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిఆర్‌ఎస్‌దే విజయం

- Advertisement -
- Advertisement -

సర్వే వివరాలు వెల్లడించిన ‘ఆరా’ అధినేత మస్తాన్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మరోసారి టిఆర్‌ఎస్‌దే విజయమని ఎంతోకాలంగా రా జకీయ సర్వేలు నిర్వహిస్తూ పేరుగాంచిన ‘ఆరా’ సంస్థ అధినేత మస్తాన్ వెల్లడించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి 119నియోజకవర్గాల్లో చేశామన్నారు. ఇందులో ఏ పార్టీ ప్రొద్భలం లేదన్నారు. తమకు తాముగా సర్వే చేశామన్నారు. గత సంవత్సరం (2021) నవంబర్‌లో ఒకసారి, అలాగే ప్ర స్తుత సంవత్సరం మార్చి, జులై నెలలో రెండు దఫాలుగా మొత్తం మూడు విడతలు సర్వే నిర్వహించామన్నారు. ఈ మూడు విడతల్లో నిర్వహించిన స ర్వేలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు అయిన టిఆర్‌ఎస్‌కు సరాసరి 38.88.శాతం, బిజెపికి 30.48 శాతం, కాంగ్రెస్‌కు 23.71 శాతం ఓట్లు రాగా, ఇతరులు 6.91 ఓట్ల శాతం సాధించారన్నారు. మొదటి, రెండు విడతల్లో 40 చొప్పున, మూడవ విడతలో 39 నియోజకవర్గాల్లో సర్వే పూ ర్తి చేశామన్నారు.

సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మ స్తాన్ మాట్లాడుతూ, ప్రతి విడత సర్వేలో రాష్ట్రంలో ని అన్ని రకాల నియోజకవర్గాలు కలిసివచ్చేట్టుగా ఎస్‌సి 6 నుంచి 7, ఎస్‌టి 3 నుంచి 4, పట్టణ నియోజకవర్గాలు 10 నుంచి 11, గ్రామీణ నియోజకవర్గాలు 18 నుంచి 19 వచ్చే విధంగా సర్వే చేయడం జరిగిందని వివరించారు. తమ సర్వే నివేదికను సిఎం కెసిఆర్‌కు ఇచ్చామని, పిసిసి అధ్యక్షు డు రేవంత్‌రెడ్డి మాట్లాడిన నేపథ్యంలోనే మీడి యా ముందుకు రావాల్సి వచ్చిందన్నారు. ఆయనకు సమాచార లోపం ఉందన్నా రు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, రం గారెడ్డి జిల్లాల్లో పోటీ టిఆర్‌ఎస్, బిజెపిల మధ్యే నెలకొని ఉందని మస్తార్ తెలిపారు. ఈ ఐదు జిల్లాలో రెండు పార్టీల మధ్య పోటీ నువ్వా? నేనా? అన్నట్లుగా ఉండబోతోందని వెల్లడించారు. ఇక వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలో బిజెపి ప్రభావం పెద్దగా ఉండే అవకాశం లేదన్నారు. ఈ మూడు జిల్లాలో టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య నెలకొని ఉందన్నారు. మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రం మూడు పార్టీల పోటీ నెలకొని ఉందన్నారు.

జిల్లాల వారీగా ఓట్ల శాతం

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న రాజకీయ పార్టీల స్థితిగతులను బట్టి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలను ఒక జోన్‌గా విభజించి సర్వే చేయగా టిఆర్‌ఎస్‌కు 39.07 శాతం, బిజెపికి 35.69 శాతం, కాంగ్రెస్ 18.91శాతం, ఇతరులకు 6.31శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు.మెదక్, మహబూబ్‌నగర్‌లో టిఆర్‌ఎస్‌కు 40.89 శాతం, బిజెపికి 30.37 శాతం, కాంగ్రెస్‌కు 23.38శాతం, ఇతరులు 5.34శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో టిఆర్‌ఎస్‌కు 40.43 శాతం, బిజెపి 35.32 శాతం. కాంగ్రెస్‌కు 16.33 శాతం, ఇతరులు 7.92 ఓట్లు వచ్చాయి. ఖమ్మం, నల్గొండలో టిఆర్‌ఎస్‌కు 35.14 శాతం, బిజెపి 20.54 శాతం, కాంగ్రెస్ 36.22 శాతం, ఇతరులు 8.10 శాతం ఓట్లు సాధించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆరా సంస్థ ఇప్పటివరకు నిర్వహించిన సర్వేలన్నీ దాదాపుగా నిజం అయ్యాయని ఆయన వివరించారు.

హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాన్ని, అలాగే ఎపిలో వైఎస్‌ఆర్‌సిపి గెలుస్తుందని కూడా ముందే చెప్పామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 46.87 శాతం ఓట్లు సాధించిన టిఆర్‌ఎస్ నాలుగు నెలల తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 5 శాతం ఓట్లను కోల్పోయి 41.71 శాతాన్ని సాధించిందన్నారు. అయితే ప్రస్తుత సర్వే ప్రకారం 8శాతం ఓట్లను కోల్పోయి 38.88 శాతం ఓట్లతో ముచ్చటగా మూడవసారి అధికారాన్ని కైవసం చేసుకోడం ఖాయమన్నారు. కాగా 87 నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్‌కు బలమైన అభ్యర్ధులు ఉండగా, కాంగ్రెస్‌కు 53, బిజెపికి 29 నియోజకవర్గాల్లో ఉన్నట్లుగా తమ సర్వేలో వెల్లడైందని మస్తాన్ వివరించారు. కాంగ్రెస్, బిజెపిలకు ఇతర పార్టీల నుంచి చేరే వారే బలమైన అభ్యర్ధులు ….కానీ వారు ఆ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చేంత సీను లేదన్నారు.

మరింత దిగజారనున్న కాంగ్రెస్

గత అసెంబ్లీ ఎన్నికల్లో 28.43 శాతం ఓట్లను సాధించిన కాంగ్రెస్ పార్టీ 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 29.78 శాతం ఓట్లను సాధించింది. అయితే ప్రస్తుత సర్వేలో గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే….4.72 శాతం ఓట్లను కోల్పోయి 23.71 శాతానికి పరిమితం కాబోతోందని వివరించారు. ముఖ్యంగా 2019 ఎన్నికల తరువాత రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలు కావడం…..గతం కంటే తక్కువ ఓట్లు సాధించిన కారణంగా కాంగ్రెస్ పట్ల ప్రజల్లో పెద్దగా ఆదారణ కనిపించడం లేదని వివరించారు.

బలం పెంచుకోనున్న బిజెపి

గత అసెంబ్లీ ఎన్నికల్లో 6.98 శాతం ఓట్లను సాధించిన బిజెపి…2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 19.65 శాతం ఓట్లను సాధించిందన్నారు. అయితే తాము నిర్వహించిన ప్రస్తుత సర్వే ప్రకారం గత అసెంబ్లీ ఎన్నికల కంటే 23.5 శాతం అధిక ఓట్లను సాధించి 30.38 శాతం ఓట్లను సాధించనుందని మస్తాన్ తెలిపారు. అయితే గతంలో కంటే బిజెపి తన బలాన్ని పెంచుకున్నప్పటికీ టిఆర్‌ఎస్‌తో తలబడి అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశాలు లేవని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News