Wednesday, January 22, 2025

ధోనీపై పరువు నష్టం దావా..

- Advertisement -
- Advertisement -

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీపై పరువు నష్టం కేసు నమోదైంది. తప్పుడు ఆరోపణలు చేస్తూ..తమ పురువుకు భంగం కలిగించేలా ప్రకటనలు చేస్తున్నారంటూ ధోనీపై అతని మాజీ వ్యాపార భాగస్వాములు దేశ రాజధాని ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం కేసు వేశారు. క్రికెట్ అకాడమీ పెడతామని చెప్పి ఆర్కా స్పోర్ట్స్‌ సంస్థ రూ.15 కోట్ల మేర తనను మోసం చేసిందంటూ ధోనీ ఇటీవల కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కా స్పోర్ట్స్‌ డైరెక్టర్లు మిహిర్ దివాక‌ర్‌, సౌమ్యా విశ్వాస్ ‌లు.. ధోనీపై పరువు నష్టం దావా వేశారు.

క్రికెట్ అకాడిమీ విషయంలో ఒప్పంద ఉల్లంఘన జరిగిందంటూ ధోనీ తమపై తప్పుడు ఆరోపణలు చేశారని, తమ పరువుకు భంగం కలిగించేలా ప్రకటనలు చేశారని.. అందుకు ధోనీ నష్ట పరిహారం చెల్లించాలని ఆర్కా స్పోర్ట్స్‌ డైరెక్టర్లు కోరారు. దాంతోపాటు సోషల్ మీడియాలో తమపై ధోనీ అవాస్తవాలు ప్రచారం చేయకుండా నియంత్రించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు జనవరి 18న విచారించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News