Monday, December 23, 2024

ఆరోగ్య శ్రీ సేవలు ఆపేశారంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ఖండించింది. ఆరోగ్య శ్రీ ఆస్పత్రులకు రూ.368 కోట్ల నిధులు విడుదల చేశామని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ పేర్కొంది. గత 18 రోజుల్లో ఆరోగ్య ఆస్పత్రులకు రూ.774 కోట్లు విడుదల చేశామని, నిరంతరాయంగా పేదలకు ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయని వివరించింది. ఆరోగ్య శ్రీ సేవలు ఆపేశారంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేయడం తగదని, ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య శ్రీ సేవలు యథాతథంగా నడుస్తున్నాయని సిఇఒ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

Also Read: కిషన్ రెడ్డి మాతృమూర్తి కన్నుమూత… కెసిఆర్ సంతాపం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News