Monday, December 23, 2024

వన్డేలకు అరోన్ ఫించ్ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

Aaron Finch has announced his retirement from ODI cricket

కైర్న్: ఆస్ట్రేలియా టీమ్ కెప్టెన్‌అరోన్ ఫించ్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగే మూడో, చివరి వన్డే తర్వాత ఈ ఫార్మాన్ నుంచి తప్పుకుంటానని వెల్లడించాడు. టి20 క్రికెట్‌పై మరింత దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు శనివారం మీడియా సమావేశంలో స్పష్టం చేశాడు. తన వన్డే కెరీర్‌లో ఆదివారం చివరి మ్యాచ్ ఆడనున్నట్టు తెలిపాడు. ఇటీవల కాలంలో ఫించ్ వన్డే ఫార్మాట్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. దీంతో ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చాడు. ఇక 2013లో అంతర్జాతీయ వన్డే కెరీర్‌కు శ్రీకారం చుట్టిన ఫించ్ 148 ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించాడు. అంతేగాక వన్డేల్లో 5041 పరుగులు చేశాడు. ఇందులో 17 శతకాలు, మరో 30 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. అంతేగాక 54 వన్డేల్లో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా కూడా ఫించ్ వ్యవహరించాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News