Wednesday, January 22, 2025

‘ఆట’ డ్యాన్స్ విన్నర్ టీనా ఇకలేరు

- Advertisement -
- Advertisement -

Aata 1 Winner Tina passed away

హైదరాబాద్: ఓంకార్ హోస్ట్ గా చేసిన ‘ఆట’ డ్యాన్స్ రియాలిటీషో మొదటి సీజన్ విన్నర్ టీనా గురువారం కన్నుమూశారు.  ఈ విషయాన్ని ఆట సందీప్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపాడు. అప్పట్లో ఆట షో చాలా పాపులర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. టీనా మరణవార్త వినగానే షాక్ కి గురయ్యానని ఆయన పేర్కొన్నాడు. ఆమె కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేస్తూ.. ఆమె ఆత్మకి శాంతి చేకూరలంటూ ఇన్‌స్టాలో వెల్లడించాడు. టీనా ఆట సీజన్-4 లో జడ్జిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. గోవాలో టీనా మృతిచెందినట్టు సమాచారం. ఆమె కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఆమె మరణానానికి గల కారణాలు ఇంకా తెలియాల్సిఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News