హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా జట్టు ఓటమిని చవిచూసింది. తొలి టెస్టులో రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్ గాయపడడంతో మిగిలిన టెస్టులకు వాళ్లు ఆడే అవకాశం లేకపోవడంతో సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్‌కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను రెండో టెస్టుకు ఎంపిక చేశారు. తొలి టెస్టు ఓటమిని రెండో టెస్టులో ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఎబి డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమై బ్యాట్స్‌మెన్ అని ప్రశంసించాడు.
అతడి రాకకోసం తాము ఎదురుచూస్తున్నామని పేర్కొన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడి నెలకొల్పిన రికార్డులు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. భారత జట్టు తరపున ఆడేందుకు అన్ని అర్హతలు సర్ఫరాజ్ ఖాన్‌కు ఉన్నాయని ఎబి డి మెచ్చుకున్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 66 ఇన్నింగ్స్‌లలో 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలతో 3912 పరుగులు చేయగా అతడి సగటు 69.85గా ఉంది. డొమాస్టిక్ క్రికెట్‌లో రజత్ పాటిదార్ బ్యాటింగ్ శైలి బాగుందని ఎబి డి మెచ్చుకున్నారు. జట్టులో ఎవరికి చోటు దక్కుతుందో అని ఆసక్తి నెలకొందన్నారు.