Sunday, January 19, 2025

14 వాలెంట్ న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ ను ఆవిష్కరించిన అబాట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆరు వారాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం న్యూమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ న్యుమోషీల్డ్ 14ను ఆవిష్కరించినట్లుగా అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ అగ్రగామి అయిన అబాట్ ఈరోజు ప్రకటించింది. అబాట్ పీసీవీ -14 వాలెంట్ (న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్) ఇప్పటికే ఉన్న PCV-10, PCV-13 వ్యాక్సిన్‌లతో పోలిస్తే అత్యధిక సంఖ్యలో సెరోటైప్‌లు లేదా స్ట్రెయిన్‌లను కవర్ చేస్తూ విస్తృత రక్షణను అందిస్తుంది.

ఒక స్ట్రెయిన్ అనేది ఒక సూక్ష్మజీవి జన్యు లేదా నిర్మాణ వైవిధ్యం లేదా ఉప రకాన్ని సూచిస్తుంది. అబాట్ న్యుమోషీల్డ్ 14 టీకాలోని PCV-14 పదజాలం ఈ టీకా 14 రకాల న్యుమోకాకల్ బాక్టీరియా నుండి రక్షణను అందిస్తుంది అనే వాస్తవాన్ని సూచిస్తుంది. కాంజుగేట్ వ్యాక్సిన్ అనేది ఒక ప్రత్యేకమైన టీకా. ఇది బ్యాక్టీరియాలో కొంత భాగాన్ని ప్రోటీన్‌తో కలిపి మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ బ్యాక్టీరియాను మరింత ప్రభావవంతంగా గుర్తించడానికి, పోరాడటానికి సహాయపడుతుంది. కొన్ని ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా బలపరు స్తుంది. ఇది తీవ్రమైన వ్యాధుల తగ్గింపునకు దారితీస్తుంది, ముఖ్యంగా పిల్లలలో.

ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, ముఖ్యంగా రెండు సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారు, బ్యాక్టీరియా సంక్రమణ వలన సంభవించే న్యుమోకాకల్ వ్యాధి నుంచి అధిక ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. న్యుమోకాకల్ ఇన్‌ఫెక్షన్లు న్యుమోనియా, మెనింజైటిస్ (మెదడు, వెన్నుపాము చుట్టూ ఉన్న కణజాలాల వాపు) లేదా రక్త ఇన్‌ఫెక్షన్‌లతో సహా అనేక రకాల పరిస్థితులకు దారితీయవచ్చు, వీటిని సమిష్టిగా ఇన్వాసివ్ న్యుమోకాకల్ డిసీజ్ (IPD) అంటారు. టీకాలు వేయడం వల్ల ఈ ఇన్ఫెక్షన్‌లలో కొన్నింటి నుండి రక్షించవచ్చు మరియు పిల్లలలో సమస్యలను నివారించవచ్చు.

ఐపీడీ అనేది ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో అధిక మరణాలతో సంబంధం కలిగి ఉంది, దీని ఫలితంగా భారతదేశంలో 14% మరణాలు సంభవిస్తున్నాయి. PCV-14 వ్యాక్సిన్ PCV 10 కంటే ఐదు ఎక్కువ స్ట్రెయిన్స్ నుండి రక్షిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో ప్రైవేట్ క్లినిక్‌లు, ఆసుపత్రులలో ఉపయోగిస్తున్న PCV 13 వ్యాక్సిన్‌ల కంటే రెండు ఎక్కువ స్ట్రెయిన్స్ నుంచి రక్షిస్తుంది. ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ల ద్వారా నిర్వహించబడే న్యుమోషీల్డ్ 14 కోసం సిఫార్సు చేయబడిన రోగనిరోధకత షెడ్యూల్ 6, 10 మరియు 14 వారాలలో ఉంటుంది.

అబాట్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ స్వాతి దలాల్ మాట్లాడుతూ, “పిల్లలు, ముఖ్యంగా రెండేళ్లలోపు వారికి న్యుమోకాకల్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఇది వారి ఆరోగ్యకరమైన పెరుగుదల, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది, సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ ఆవిష్కరణ భారతదేశంలో ఎక్కువ శాతం న్యుమోకాకల్ సంబంధిత వ్యాధులకు కారణమవుతూ, వ్యాప్తిలో ఉన్న 14 న్యుమోకాకల్ స్ట్రెయిన్స్ నుంచి విస్తృత రక్షణ సామ ర్థ్యాన్ని అందిస్తుంది. ఈ వ్యాక్సిన్‌ని పరిచయం చేయడం అనేది పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు వినూత్నమైన పీడియాట్రిక్ వ్యాక్సిన్‌లను అందించాలనే మా నిబద్ధతలో మరో అడుగు.

హైదరాబాద్‌లోని JJ హాస్పిటల్‌ శిశువైద్యులు డాక్టర్ సురేంద్రనాథ్ మాట్లాడుతూ, “ముఖ్యంగా పిల్లలలో న్యుమో నియా, మెనింజైటిస్ వంటి న్యుమోకాకల్ సంబంధిత వ్యాధులతో పోరాడటానికి తల్లిదండ్రులకు రోగనిరోధకత ఒక ముఖ్యమైన రక్షణ పరిష్కారాన్ని అందిస్తుంది. అటువంటి వ్యాధులను నిర్ధారించడంలో, చికిత్స చేయడంలో ఉన్న సవాళ్లను పరిగణనలోకి తీసుకుంటే, సంబంధిత న్యుమోకాకల్ బ్యాక్టీరియా జాతుల విస్తృత ప్రాతినిధ్యంతో అధునాతన వ్యాక్సిన్‌లకు సంబంధించి స్పష్టమైన అవసరం ఉంది. ఇది పిల్లలలో న్యుమోకాకల్ వ్యాధి నుండి విస్తృత రక్షణను అందించడంలో సహాయపడుతుంది’’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News