Friday, December 20, 2024

ఎబిసి జర్నలిస్టుపై జాత్యాహంకార వేటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ఎబిసి) న్యూస్ ప్రజంటెటర్, సీనియర్ లేడీ జర్నలిస్టు ఆంటోనెటి లటౌఫ్‌పై ఆ సంస్థ వేటేసింది. ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణపై ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టు కారణంగా తాము ఈ చర్యకు దిగామని ఎబిసి తెలిపింది. ఎబిసి రేడియో షోలలో ప్రఖ్యాతమైన ఈ జర్నలిస్టుపై చర్య పట్ల ప్రజల నుంచి సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. లెబనాన్ మూలాలు ఉన్న ఈ జర్నలిస్టు తనను బయటకు పంపించడం కేవలం బయటి వారి ఒత్తిడి, రాజకీయ కారణాలతోనే జరిగిందని , ఇందులో జాతిపరమైన అంశాలు కూడా ఉన్నాయని భావిస్తున్నానని తెలిపారు. తనను అక్రమంగా బర్తరఫ్ చేసినందుకు సంస్థపై కేసు పెడుతున్నట్లు తెలిపారు.

తన విధులను సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ తెరవెనుకరాజకీయాలు జరిగి ఉంటాయని ఆమె ఆరోపించారు. ఇజ్రాయెల్ వర్గాలు తనకు వ్యతిరేకంగా పనిచేసి ఉంటాయని తెలిపారు. ఆమె విద్వేషం, యూధుల పట్ల వ్యతిరేకతను ప్రచారం చేసే రీతిలో తప్పుడు కథనాలకు దిగుతున్నారని ఇజ్రాయెల్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆమెపై తీసుకున్న చర్యను ఎబిసి యాజమాన్యం సమర్థించుకుంది. గాజాస్ట్రిప్‌లో దాడులకు దిగుతోన్న ఇజ్రాయెల్ సేనలు పౌరులకు ప్రాణాంతక రీతిలో మంచినీటి సరఫరాలను అడ్డుకుంటున్నారని, పైప్‌లైన్లను నిలిపివేస్తున్నారని పేర్కొంటూ ఈ జర్నలిస్టు స్పందించింది. దీనిపై స్పందించిన ఈ జర్నలిస్టు ఇతర జర్నలిస్టులు పోస్టు చేసిందే తాను కూడా వెలువరించానని , మరి తనపైనే ఈ చర్య తీసుకోవడం కేవలం రేసిజం వల్లనే తాను భావిస్తున్నానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News