Monday, December 23, 2024

భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవానికి ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తాహ్ అల్‌సిసీ ముఖ్య అతిథిగా రానున్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. భారత గణతంత్ర దినోత్సవానికి ఈజిప్టు అధ్యక్షుడు ముఖ్యఅతిథిగా రావడం అన్నది ఇదే మొదటిసారి అని కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ప్రధాని మోడీ లాంఛనప్రాయ ఆహ్వానాన్ని విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ అక్టోబర్ 16ననే అందజేశారు. రెండు దేశాలు ఈ ఏడాది 75వ స్వాతంత్య్రోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాయి. భారత, ఈజిప్టు దేశాల మధ్య స్నేహసంబంధాలు చిరకాలంగా ఉన్నాయి. రెండు దేశాలు 1950 నుంచే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాయి. నాడు ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నోను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. 1952, 1953,1966 సంవత్సరాల గణతంత్ర దినోత్సవానికి ఏ విదేశీ నాయకుడిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించలేదు.2007లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, 2008లో ఫ్రెంచ్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ, 2015లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, 2016లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలాండ్, 2020లో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో భారత గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథులుగా వచ్చారు. 2021లో బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం జరిగింది. కానీ బ్రిటన్‌లో కొవిడ్19 కేసులు పెరిగిపోయినందున ఆయన సందర్శన రద్దయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News