ముంబయి: అమ్మాయిని అపహరించిన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ వ్యక్తి గ్రామీణ ప్రాంతాలలో భజన పాటలు పాడుతూ జీవనం సాగిస్తున్నాడు. అమ్మాయిని అపహరించిన కేసులో అతడిని పోస్కో యాక్ట్ కింద పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పిషోర్ పోలీసులు అతడిని ఐదు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. అతడికి రక్షణగా ఉన్న పోలీస్ ను మలవిసర్జన కోసం బాత్రూమ్ వెళ్తునని చెప్పి వెళ్లాడు. బాత్రూమ్ లో కడిగే యాసిడ్ ను తాగి బయటకు వచ్చేటప్పుడు వాంతులు చేసుకున్నాడు. వెంటనే పోలీసులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. ఈ ఘటనపై అతడి బంధువులు పోలీసుల వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు. అతడికి సెక్యూరిటీ ఉన్న పోలీస్ ను సస్పెండ్ చేశామని పోలీస్ ఉన్నతాధికారి విశాల్ నెహుల్ పటేల్ తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని విశాల్ వెల్లడించారు.