Monday, December 23, 2024

సరూర్‌నగర్‌లో బాలుడి అపహరణ…

- Advertisement -
- Advertisement -

Abduction of boy in Saroornagar

హైదరాబాద్ : నగరంలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం బాలుడు అపహరణకు గురయ్యాడు. గమనించిన తల్లిదండ్రులు సమీప బంధువులు, ఇరుగుపొరుగు వారి ఇండ్లలో వెతికారు. అయిన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత కొన్ని రోజులుగా బాలుడి తల్లిదండ్రులకు, మేనత్తకు మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బాలుడి మేనత్తే తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగానే తీసుకెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News