Monday, December 23, 2024

గర్వంగా ఉంది: రజాక్

- Advertisement -
- Advertisement -

లాహోర్: సచిన్ టెండూల్కర్ వంటి క్రికెట్ దిగ్గజం నుంచి ప్రశంసలు రావడాన్ని జీవితంలోనే అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు పాకిస్థాన్ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ పేర్కొన్నాడు. ఇటీవలే తనను ఇబ్బంది పెట్టిన బౌలర్ ఎవరనే విషయాన్ని సచిన్ టెండూల్కర్ బయటపెట్టాడు. ఓ ఇంటర్వూలో పాల్గొన్న సచిన్ తనను ఎక్కువ భయపెట్టిన బౌలర్ గురించి వివరించాడు. పాకిస్థాన్ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ బౌలింగ్‌లో తాను ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నానని సచిన్ పేర్కొన్నాడు.

వసీం అక్రం, మురళీధరన్, వకార్, మెక్‌గ్రాత్, వార్న్, బ్రెట్‌లీ వంటి దిగ్గజ బౌలర్ల నుంచి తనకు ఎలాంటి సమస్య ఎదురు కాలేదన్నాడు. అయితే రజాక్ బౌలింగ్‌లో మాత్రం ఇబ్బందులు తప్పలేదన్నాడు. ఇదిలావుంటే సచిన్ వంటి దిగ్గజం నుంచి ఇలాంటి ప్రశంసలు వస్తాయని తాను ఊహించలేదన్నాడు. ఇది తన జీవితంలోనే అత్యంత అరుదైన విషయంగా రజాక్ పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్‌లోనే సచిన్‌ను మించిన బ్యాటర్ మరోకరూ లేడన్నాడు. అలాంటి బ్యాటర్‌ను తాను ఇబ్బంది పెట్టానంటే నమ్మలేక పోతున్నానని రజాక్ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News