Wednesday, January 22, 2025

‘ఐశ్వర్యారాయ్ ని నేను పెళ్లిచేసుకున్నంత మాత్రాన అందమైన పిల్లలు పుడతారా?’

- Advertisement -
- Advertisement -

పాక్ క్రికెటర్ అనుచిత వ్యాఖ్యలు

ప్రపంచ కప్ లో పాకిస్తాన్ బొక్క బోర్లా పడటాన్ని ఆ దేశానికి చెందిన అభిమానులతోపాటు మాజీ క్రికెటర్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు… ఓటమిని జీర్ణించుకోలేక, ఇండియాపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ కూడా అదే పని చేశాడు. పైగా క్రికెట్ తో ఏ మాత్రం సంబంధం లేని ఐశ్వర్యారాయ్ పై అనుచిత వ్యాఖ్యలుచేసి, కొత్త వివాదానికి తెరతీశాడు.

ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తొమ్మిది మ్యాచ్ లు ఆడి, నాలుగింటిలో గెలిచి, ఐదోస్థానంలో సరిపెట్టుకుంది. ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయి, సెమీఫైనల్ చేరకుండానే వెనుదిరిగిన పాకిస్తాన్ జట్టుపై ఆ దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా పాకిస్తాన్ లో జరిగిన ఓ విలేఖరుల సమావేశంలో అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

రజాక్ మొదట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వైఖరిని తప్పుపడుతూ అసలు వారి సంకల్పమే బలంగా లేదన్నాడు. ‘పాకిస్తాన్ లో క్రికెటర్ల సామర్థ్యానికి పదును పెట్టాలన్న ఉద్దేశమే లేదు. అలాంటప్పుడు ఫలితం ఎలా వస్తుందో ఆలోచించుకోవచ్చు’ అన్నాడు. అంతటితో ఆగకుండా ‘నేను ఐశ్వర్యారాయ్ ని పెళ్లి చేసుకున్నంతమాత్రాన చక్కటి అందమైన పాప పుడుతుందనుకుంటే, అలా జరగదు కదా? ముందు సంకల్పం మంచిదై ఉండాలి’ అని వ్యాఖ్యానించాడు. దీంతో వేదికపైనే ఉన్న మరో మాజీ పాక్ క్రికెటర్ అఫ్రీదీ చప్పట్లు కొడుతూ, రజాక్ వ్యాఖ్యలను ఆస్వాదించడం విశేషం. అయితే రజాక్ వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. రజాక్ క్రికెట్ గురించి మాట్లాడకుండా, మధ్యలో ఐశ్వర్యారాయ్ ను రచ్చకీడ్వడాన్ని వారు తప్పుపడుతూ కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News