Thursday, January 23, 2025

అంతర్జాతీయ ఉగ్రవాదిగా అబ్దుల్ రెహ్మాన్ మక్కీ

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: పాకిస్థాన్‌కు చెందిన తొయిబా డిప్యూటీ లీడర్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి ప్రకటన వెనుక చైనా సహకారం ఉండటం విశేషం. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా డిప్యూటీ చీఫ్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చాలని భారత్, అమెరికా సంయుక్తంగా ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదనను అడ్డుకున్న చైనా తన పట్టును వీడటంతో యూఎన్ అబ్దుల్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది. భద్రతామండలి అల్‌ఖైదా ఆంక్షల కమిటీ ఏకాభిప్రాయం ద్వారా అతడిని బ్లాక్‌లిస్టులో చేర్చేందుకు మార్గం సుగమమైంది. యూఎన్ భద్రతామండలి 1267 (దాయెష్) అల్‌ఖైదా ఆంక్షల కమిటీ 68ఏళ్ల మక్కీని సోమవారం అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. దీంతో మక్కీ ఆస్తులును స్తంభింపచేయడం, అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం, ఆయుధాలు స్వాధీనం తదితర చర్యలు చేపట్టనున్నారు. పాక్ సన్నిహిత చైనా జూన్ 16, 2022న భారత్, యూఎస్ ప్రతిపాదనకు మోకాలడ్డింది.

అనంతరం ఏడు నెలల తర్వాత మక్కీ ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలోకి ఎక్కాడు. లష్కరే తొయిబా చీఫ్ ముహమ్మద్ సయ్యద్‌కు మక్కీ బావమరిదిగా అధికారులు తెలిపారు. 1267 ఆంక్షల కమిటీ ప్రకారం వ్యక్తులు లేదా సంస్థలను అంతర్జాతీయ ఉగ్రజాబితాలో చేర్చాలంటే నిర్ణయాన్ని ఏకాభిప్రాయం ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అల్‌ఖైదా ఆంక్షల కమిటీ కలిగి ఉన్న 15మంది భద్రతామండలి సభ్యదేశాల్లో పాక్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని జాబితాలో చేర్చే ప్రక్రియలో ఒక్క చైనా మాత్రమే అడ్డుగా నిలిచింది.

వీటో అధికారం ఉన్న యూఎన్‌లోని భద్రతామండలి శాశ్వతదేశమైన చైనా ఎట్టకేలకు భారత్, యూఎస్ సంయుక్త ప్రతిపాదనపై చైనా పట్టును ఎత్తేయడంతో మక్కీని గ్లోబల్ టెర్రరిస్టుగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 2019మేలో పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా యూఎన్ ప్రకటింపచేయడంలో భారత్ విజయం సాధించింది. కాగా భారత్, యూఎస్ ప్రతిపాదనపై అభ్యంతరాన్ని ఉపసంహరించుకున్న అనంతరం చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ మాట్లాడుతూ ఉగ్రవాదం ప్రపంచ మానవాళికి ఉమ్మడి శత్రువుగా పేర్కొన్నారు. 1267 కమిటీ (యూఎన్ భద్రతా మండలి) అంతర్జాతీయ ఉగ్రవాద నిరోధక యంత్రాంగం ఉగ్రవాద ముపును సమర్థంగా ఎదుర్కొంటుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News