Sunday, December 22, 2024

పాకిస్థాన్ 328/4

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్‌తో సోమవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఆతిథ్య పాకిస్థాన్ మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. ఓపెనర్ సైమ్ అయూబ్ (4) పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే కెప్టెన్ షాన్ మసూద్‌తో కలిసి మరో ఓపెనర్ అబ్దుల్లా షఫిక్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. మసూద్ దూకుడుగా ఆడగా, షఫిక్ సమన్వయంతో బ్యాటింగ్ చేశాడు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి జట్టు బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు 253 పరుగులు జోడించడం విశేషం. అద్భుత ఇన్నింగ్స్‌ను ఆడిన షఫిక్ 184 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. ఇక షాన్ మసూద్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ స్కోరును పరిగెత్తించాడు. అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన మసూద్ 177 బంతుల్లో 13 బౌండరీలు, రెండు సిక్సర్లతో151 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు బాబర్ ఆజమ్ (30) పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆట ముగిసే సమయానికి సౌద్ షకిల్ (35) క్రీజులో నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News