Monday, December 23, 2024

భార్య తల నరికేసి… పక్కన పెట్టిన భర్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అబ్దుల్లాపూర్ మెట్టు జన్నారం కాలనీలో దారుణం చోటుచేసుకుంది. భార్య తలను భర్త నరికివేశాడు. భార్య పుష్ప తలను భర్త విజయ్ నరికి పక్కన పెట్టాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తల, మొండాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్తను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆమెకు మూడో పెళ్లి అతడికి మొదటి పెళ్లి కావడంతో ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. వయసు రీత్యా ఇద్దరు మధ్య చాలా తేడా ఉండడంతో దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండడంతో దంపతుల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో భార్యను భర్త హత్య చేసినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News