- Advertisement -
హైదరాబాద్ : పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో వారం రోజుల్లో అభయహస్తం డబ్బులు జమ చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం ఆయన వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళల సభ్యులకు రూ.22 వేల కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. మహిళలు ప్రభుత్వం ఇచ్చే రుణాలతో సొంతంగా వ్యాపారం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని గుర్తుచేశారు. అభయహస్తం డబ్బులు వారం రోజుల్లో ఖాతాలో జమ చేస్తామని ఆయన వెల్లడించారు.
- Advertisement -