- Advertisement -
వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస ‘తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటిరిరియల్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచాయి. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. జూన్ 2న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ లో అభిరామ్ లుక్ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ కాగ, అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందిస్తున్నారు. సుప్రియ ఆర్ట్ డైరెక్టర్.
- Advertisement -