Tuesday, January 21, 2025

కోల్‌కతా లోనే అభిషేక్ బెనర్జీ విచారణ

- Advertisement -
- Advertisement -

Abhishek Banerjee Interrogate in Kolkata

ఆటంకం కలిగిస్తే ఊరుకోం : సుప్రీం

న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మేనల్లుడు, తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరా బెనర్జీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. బొగ్గు స్మగ్లింగ్‌కు సంబంధించిన కేసులో వీరిని అరెస్టు చేయకుండా సర్వోన్నత న్యాయస్థానం రక్షణ కల్పించింది. అంతేగాక, వీరిద్దరినీ కోల్‌కతా లోనే ప్రశ్నించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. అయితే ఈ విచారణకు బెంగాల్ ప్రభుత్వం ఆటంకం కలిగించాలని చూస్తే మాత్రం సహించేది లేదని న్యాయస్థానం హెచ్చరించింది. ఈస్టర్న్ కోల్డ్ పీల్డ్ లిమిటెడ్‌కు చెందిన గనుల్లో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై సిబిఐ 2020 లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రారంభించింది. ఈ కుంభకోణంలో అభిషేక్ బెనర్జీ లబ్ధి పొందారని ఈడీ ఆరోపించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అభిషేక్, ఆయన భార్య రుజిరాను ప్రశ్నించేందుకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈనెల మార్చి 21,22 తేదీల్లో ఢిల్లీకి రావాలని పిలిచింది.

అయితే ఈ సమన్లను సవాలు చేస్తే బెనర్జీ దంపతులు డిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమను ఢిల్లీలో కాకుండా కోలోకతాలో ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే అందుకు హైకోర్టు నిరాకరించింది. మరో వైపు, ఈడీ విచారణకు హాజరు కాకపోవడంతో అభిషేక్ దంపతులపై బెయిబుల్ వారెంట్ జారీ అయింది. ఈ వ్యవహారం కాస్త సుప్రీం కోర్టుకు చేరడంతో అభిషేక్ దంపతులకు కాస్త ఊరట లభించింది. అభిషేక్ , రుజిరాలను కోల్‌కతా లోనే ప్రశ్నించేందుకు సుప్రీం కోర్టు అనుమతినిచ్చింది. ఆయనను విచారించాలనుకుంటే 24 గంటల ముందే సమాచారం ఇవ్వాలని ఈడీకి తెలిపింది. అయితే ఈ విచారణ నిమిత్తం బెంగాల్ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థకు పూర్తి సహకారం అందించాలని ఆదేశించింది. దర్యాప్తు సంస్థ అధికారులు కోల్‌కతా వచ్చినప్పుడు వారికి రక్షణ కల్పించాలని సూచించింది. ఈ విచారణకు రాష్ట్ర యంత్రాంగం నుంచి ఎలాంటి ఆటంకం ఎదురైనా అనవసర జోక్యం చేసుకున్నా సహించేది లేదని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News