Tuesday, April 15, 2025

మా నాన్నను మెప్పించలేకపోయా: అభిషేక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారీ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించినా తన తండ్రి రాజ్‌కుమార్ శర్మని మెప్పించలేకపోయాడట సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ(141). ఫాంలేమితో తంటాలు పడ్డా ఇతగాడు ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్ మ్యాన్ షోతో జట్టుకు భారీ విజయాన్ని కట్టబెట్టాడు అభిషేక్. మ్యాచ్ అనంతరం మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన అభిషేక్.. ‘ఈ ఇన్నింగ్స్ తనకెంతో స్పెషల్. ఆరెంజ్ ఆర్మి, నా తల్లిదండ్రుల మధ్య ఈ ఇన్నింగ్స్ ఆడటం భలేగా ఉందని, కానీ మా నాన్నని మెప్పించలేకపోయానని.

అండర్14 రోజుల నుంచి నాన్న నా తీరును చూసేందుకు మైదానలకు వచ్చేవాడని, మా నాన్నే నా తొలి కోచ్. మైదానంలో బ్యాటింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న సైగలతో అలా కొట్టు.. ఇలా కొట్టు అంటూ.. సూచన సూచనలు ఇచ్చే వారని, కానీ ఈ ఇన్నింగ్స్ ఆయన పెద్దగా అనిపించలేదని గ్రహించాను’ అని పేర్కొన్నాడు. కాగా, ఆదివారం పంజాబ్ జరిగిన మ్యాచ్‌లో భారీ సిక్సర్లు, బౌండరీతో 141 పరుగులు చేశాడు. ఇదే అభిషేక్ అత్యధిక స్కోరు. ఐపిఎల్ చరిత్రలో లక్ష ఛేదనకు దిగన జట్టులో అత్యదిక పరుగులు చేసిన బ్యాటర్‌గాను అభిషేక్ నయా చరిత్రను నెలకొల్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News