- Advertisement -
ముంబై: టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ మరోసారి వీరవిధ్వంసం చేశాడు. 96 బం తుల్లో 22 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 170 పరుగుల భారీ శతకం సాధించాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ జట్టుకు సారథ్యం వహిస్తున్న అభిషేక్.. సౌరాష్ట్రతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బ్యా ట్ ఝులిపించాడు. అతనికి తోడుగా మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(125) సెంచరీతో రాణించాడు. దాంతో ఈ మ్యాచ్‌లో పంజాబ్ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 424 పరుగుల భారీ స్కోర్ చేసింది.
- Advertisement -