హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అభిషేక్ శర్మ ధాటిగా బ్యాటింగ్ చేయడంతోనే 12.5 ఓవర్లలో 133 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా చేధించింది. 34 బంతుల్లో 8 సిక్స్‌లు, ఐదు ఫోర్లతో 79 పరుగులు చేసి సునామీ సృష్టించాడు. హాఫ్ సెంచరీ చేసిన తరువాత బొటనవేలు, చూపుడు వేలు పైకి చూపిస్తూ అభివాదం చేశారు. మ్యాచ్ అనంతరం దీనిపై సమాధానం ఇచ్చాడు. అర్థ శతకం చేయడం చాలా సంతోషంగా ఉందని, అభివాదం చేయడానికి ఓ కారణం ఉందని, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గంభీర్ కోసమే చేశాని అభిషేక్ శర్మ తెలిపారు. ఈ మ్యాచ్‌లో తనని తాను నిరూపించుకోవడానికి ప్రయత్నించానన్నారు.
కోచ్, కెప్టెన్ యువ క్రికెటర్లతో మాట్లాడే విధానం బాగుంటుందని ప్రశంసించారు. టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో స్వల్ప లక్ష్యాన్ని తమ ముందు ఉంచేలా చేశారన్నారు. అర్షదీప్, వరుణ చక్కటి లైన్ లెంగ్త్ బౌలింగ్ చేయడంతో మాకు ఛేదన సులభమైందన్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో 160 నుంచి 170 పరుగుల లక్ష్యం ఉంటుందని భావించామన్నారు. సంజు శాంసన్ మరో ఎండ్‌లో ఉండటం ఆటను ఆస్వాధించానని వివరణ ఇచ్చారు. ఐపిఎల్‌లో దాటిగా బ్యాటింగ్ చేయడంతో ఇక్కడ కలిసి వచ్చిందని, టీమిండియా జట్టులో వాతావరణం బాగుందన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లు షార్ట్ పిచ్ బంతులతో ఇబ్బంది పెడుతారని ముందే తమకు తెలుసునని అభిషేక్ తెలిపారు.