Thursday, January 23, 2025

కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ నామినేషన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ సోమవారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు హాజరయ్యారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు సింఘ్వీ. తెలంగాణ నుండి రాజ్యసభ సభ్యుడిని కావడం గర్వంగా ఉందని సింఘ్వీ అన్నారు. తెలంగాణ ప్రజల వాయిస్ ను చట్టసభల్లో బలంగా వినిపిస్తానని సింఘ్వీ చెప్పారు.

ఆదివారం గచ్చిబౌలిలో జరిగిన సీఎల్పీ సమావేశంలో రాజ్యసభ ఎన్నికలపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్థేశం చేశారు. అనంతరం సింఘ్వీని రాజ్యసభ సభ్యుడిగా సీఎల్పీ తీర్మాణం చేసిన సంగతి తెలిసిందే. కాగా, కే కేశవరావు రాజీనామాతో రాజ్యసభకు వెళ్లే అవకాశం సింఘ్వీకి వచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News