Wednesday, January 22, 2025

శ్రీశైలం మల్లన్న అభిషేకాలు నిలిపివేత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : శ్రీశైలం మహాక్షేత్రంలో అభిషేకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. వారాంతం సందర్భంగా శని, ఆది, సోమ వారాల్లో అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉన్నందున మల్లికార్జున స్వామి సామూహిక అభిషేకాలు, గర్భాలయ అభిషేకాలను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. అయితే మూడు రోజులపాటు ఉదయం 6గంటలకు, మధ్యాహ్నం 11.40కి , రాత్రి 9గంటలకు స్వామి వారి స్పర్శ దర్శనాలు యధావిధిగా కొనసాగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఈ మార్పులు చేపట్టినట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News