Monday, December 23, 2024

పని చేస్తున్న సంస్థకే కన్నం వేసిన ఉద్యోగులు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః పని చేసిన సంస్థకే కన్నం వేసిన నలుగురు అంతరాష్ట్ర నిందితులను అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.05 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, డైమండ్స్ స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వర్లు పాత కమిషనరేట్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంంలో వివరాలు వెల్లడించారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన హిమాన్షు సర్దార్, కార్తిక్ బ్యాగ్, మహదేబ్ సర్దార్, ఉత్తమ్ ఓజా ఉప్పుగూడలో ఉంటూ అబిడ్స్‌లోని ఆర్‌విజే ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేస్తున్నారు. ఈ నెల 18వ తేదీన సంస్థ యజమాని బంగారు ఆభరణాలు, డైమండ్స్‌ను హిమాన్షు, కార్తీక్‌కు ఇచ్చి ముత్యాలు పెట్టమని చెప్పారు.

హౌరాకు చెందిన ఇద్దరు మిగతవారితో కలిసి వాటిని తీసుకుని సొంత ప్రాంతానికి పారిపోయారు. విషయం తెలుసుకున్న యజమాని అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేకంగా టీంను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నారు. నిందితులు చోరీ చేసిన సొత్తును హౌరా జిల్లా, అమ్టా పోస్టు, జ్యోత్‌కలాన్‌లోని కార్తీక్ ఇంటిలో దాచిపెట్టారు. సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వర్లు, ఇన్స్‌స్పెక్టర్ ప్రసాదరావు తదితరులు దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News