Sunday, December 22, 2024

దేశంలో ఎన్నికల కోడ్ ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

దేశంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ( ఎన్నికల కోడ్)ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఎత్తివేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ఆరంభం నేపథ్యంలో మార్చి 16న కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు కోడ్ ఉపసంహరణ జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. దాదాపుగా మూడున్నర నెలల పాటు కోడ్ వర్తించింది. కోడ్ ముగిసిందనే విషయాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా కేంద్ర కేబినెట్ సెక్రెటరీ , రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు తమ వర్తమానంలో తెలిపింది.

ఈసారి లోక్‌సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిషాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. దీనితో ఈసారి ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘం , విస్తృతం అయింది. ఎన్నికల ప్రక్రియ దశలో అధికారంలోని ప్రభుత్వాలు ఎటువంటి పథకాలు అమలుకు దిగినా , ప్రకటించినా అవి ఓటర్లను ప్రలోభపెట్టే పద్థధతుల పరిధిలోకి వస్తాయని పేర్కొంటూ వీటిపై నిషేధంతో కోడ్ అమలులోకి రావడం జరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఈ కోడ్ వర్తించదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News