Monday, December 23, 2024

మూఢ నమ్మకాల నిర్మూలన చట్టాన్ని తీసుకురావాలి

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: మంత్రాలు, చేతబడుల పేరుతో కొనసాగిస్తున్న ఆరాచకాలకు అరికట్టడానికి మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని తీ సుకురావాలని స్వేచ్ఛ జెఎసి, మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఆదివారం డా.నరేంద్ర దభోల్కర్ 10వ వర్ధంతి సందర్భంగా స్వేచ్చ జెఎసి, మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితిల సంయుక్త ఆధ్వర్యంలో వైజ్ఞానిక సభ, మాయల మహిమల బండారన్ని బట్టబయలు చేసే మిరాకిల్ ఎక్స్పోజర్ ప్రదర్శనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్దవిజ్ఞాన దర్శిని రమేశ్ తోపాటు పలువురు వీపుకు కొక్కాలతో కార్ ను లాగడం, మంటలపై నడవడం, గాజు పెంకులపై నడవడం, వేడి నూనేలో కాలుతున్న బజ్జీలను చేతులతో తీయడం వంటి అనేక అద్భుతాలనే వాటిని ప్రదర్శించి వాటి గు ట్టును రట్టు చేశారు. మంత్రాలు చేతబడుల పేరుతో తెలంగాణలో హత్యలు, పండ్లు ఊడబెరకడం, నాలుకలు కత్తిరించడం, కట్టేసి కొట్టడం లాంటి దారుణాలు ఇంకా కొనసాగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.వీటిని అరికట్టడానికి వెంటనే చట్టం తేవాలన్నారు. అంతకుముందు మతోన్మాదుల చే తుల్లో హత్యలకు గురైన డా.నరేంద్ర దభొల్కర్, డా.గోవింద్ పన్సారి, ప్రొ. కల్బుర్గి, జర్నలిస్ట్ గౌరి లంకేష్‌లకు నివాళ్లు అర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News