Sunday, December 22, 2024

ఆర్టికల్ 370 రద్దు సబబే

- Advertisement -
- Advertisement -

రాష్ట్రపతి నిర్ణయం రాజ్యాంగబద్ధమే

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలో ని ఆర్టికల్ 370ని రద్దు రాజ్యాంగ సమ్మతమేనని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఒకప్పటి జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ అంశంపై పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చిన రాజ్యాంగ ధర్మాసనం ఆర్టికల్ 370 ని రదు చేస్తూ కేంద్రం తీసుకున్న ని ర్ణయాన్ని సమర్థించింది.‘ జమ్మూ, కశ్మీర్‌పై ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాలు చేయలేరు. భారత్‌లో విలీనం తర్వాత జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమాధికారం లే దు. యుద్ధ పరిస్థితుల దృ ష్టా ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టారు. అది తాత్కాలిక ఏర్పాటే తప్ప శాశ్వ తం కాదు. దాన్ని రద్దుచేసే అధికా రం రాష్ట్రపతికి ఉంది. హక్కుల విషయంతో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేకత ఏమీ లేదు. దేశంలోని ఇతర రాష్ట్రా లు, కేంద్రపాలిత ప్రాంతాలతో అది కూడా సమానమే. ఆర్టికల్ 1, ఆర్టిక ల్ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్ భా రత్‌లో అంతర్భాగమే’నని సిజెఐ జస్టి స్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐ దుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాస నం తీర్పు చెప్పింది. ధర్మాసనంలో ని జడ్జీలు మూడు వేర్వేరు తీర్పుల ను వెలువరించినప్పటికీ అందరూ కూడా రద్దు సక్రమమేనని పేర్కొన డం విశేషం. కాగా జస్టిస్ చంద్రచూ డ్ తీర్పును చదివి వినిపించారు. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్‌నుంచి లడఖ్‌ను విడదీసి కేంద్రపాలిత ప్రాం తంగా చేయడాన్ని కూడా సుప్రీంకో ర్టు సమర్థించింది.అయితే ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జ మ్మూ కశ్మీర్‌లో రాష్ట్ర హోదాను వీలయినంత  త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2024 సెప్టెంబర్ 30లోగా జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
మానవ హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు జరపాలి
ఆర్టికల్ 370 రద్దు అంశంపై రాజ్యాంగ ధర్మాసనం మొ త్తం మూడు తీర్పులు వెలువరించింది. సిజెఐ చంద్రచూ డ్, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లు కలిసి ఒ క తీర్పును వెలువరించగా , జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలు వేర్వేరు తీర్పులు వెలువరించా రు. ఈ సందర్భంగా జస్టిస్ ఖన్నా తన తీర్పును వెలువరి స్తూ జమ్మూ కశ్మీర్‌లో చోటు చేసుకున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు జరగాలన్నారు. దీనికోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.1980నుంచి జమ్మూ కశ్మీర్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, హింసాత్మక ఘటనలపై ఈ కమిటీ దర్యాప్తు చేపట్టాలని పేర్కొన్నారు. అయితే ఆయన సిజెఐ, జస్టిస్ కౌల్ తీర్పులతో ఏకీభవించారు.
పండిట్ల వలసలు స్వచ్ఛందం కాదు
కాగా, జమ్మూ కశ్మీర్‌నుంచి కశ్మీరీ పండిట్ల వలసలు స్వ చ్ఛందంగా జరిగినవి కాదని జస్టిస్ కౌల్ తన తీర్పులో అభిప్రాయపడ్డారు. 1980లో రాష్ట్రంలో జరిగిన హింసాకాండే కశ్మీరీ పండిట్ల వలసలకు కారణమని ఆయన అ న్నారు. 1947నుంచి కూడా కశ్మీర్ లోయ ఎన్నో దురాక్రమణలకు గురయిందని ఆయన అన్నారు. రాష్ట్రంలోకి సైన్యం రాకను ప్రస్తావిస్తూ సైన్యం పని శాంతి భద్రతలను కాపాడడం కాదని, అయితే ఇది ప్రత్యేకమైన పరిస్థితి అని, దేశ సమగ్రత, సార్వభౌమాధికారానికే ముప్పు గా పరిణమించడం వల్లనే సైన్యాన్ని దించాల్సి వచ్చిందని ఆయన అన్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూ కశ్మీర్ కు చెందిన పలు పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖ లు చేశాయి. వాటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు స భ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2నుంచి సుదీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబర్ 5న తన తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సోమవారం తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువడిన నేపథ్యంలో కశ్మీర్ అధికార యంత్రాంగం కట్టుదిట్టమయిన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. రెండు వారాలుగా కశ్మీర్ లోయలోని 10 జిల్లాల్లో భద్రతా ఏర్పాట్లపై పోలీసులు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికే కొందరు నాయకులను అదుపులోకి తీసుకోగా మరికొందరిని గృహనిర్బంధంలో ఉంచారు.
ప్రధాని మోడీ హర్షం
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ బద్ధమేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చి న తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజల ఐక్యత, ఆశలు, పురోగతిని ప్రతిధ్వనించే చా రిత్రక తీర్పు అని కొనియాడారు. ‘ ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం. 2019 ఆగస్టు 5న పార్లమెంటు తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు రాజ్యాంగబద్ధంగా సమర్థించింది. జమ్మూ కశ్మీర్, లడఖ్ సోదర సోదరీమణుల ఆశలు, ఐక్యత, పురోగతిని ప్రతిధ్వనించే ప్రకటన ఇది. భారతీయులుగా మనమెంతో గర్వపడే ఐక్యత ను సుప్రీంకోర్టు మరోసారి బలపర్చింది. జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రజల కలలను నెరవేర్చేందుకు మేం నిబద్ధతతో ఉన్నాం. ఆర్టికల్ 370తో నష్టపోయిన వారందరికీ అభివృద్ధి ఫలాలను అందిస్తాం.ఈ రోజు తీర్పు కేవలం చట్టపరమైనదే కాదు,.రానున్న తరాలకు ఇదో ఆశాకిరణం. ఉ జ్వల భవితకు వాగ్దానం. బలమైన ఐక్య భారత్‌ను నిర్మించాలనే మన సంకల్పానికి నిదర్శనం’ అని ప్రధాని ఎక్స్ వేదికగా చేసిన ఓ ట్వీట్‌లో ఆనందం వ్యక్తం చేశారు.
వేర్పాటువాదం ఇక గతమే: అమిత్ షా
ఆర్టికల్ 370 రద్దులో ప్రధాని మోడీతో పాటుగా కీలక పాత్ర పోషించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.‘ ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పేదలు, అణగారిన వర్గాల హక్కుల పునరుద్ధరణ జరుగుతుంది. వేర్పాటువాదం, రా ళ్లు రువ్వే ఘటనలు ఇక గతమే. జమ్మూ కశ్మీర్, లడఖ్‌ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.స్థానిక ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడం,అత్యాధునిక విద్యా మౌలి క వసతులను కల్పించడం,పేదలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం’ అని అమిత్ షా ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆయన తన ట్వీట్‌కు నయా జమ్మూ కశ్మీర్ అన్న హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.
సుదీర్ఘ పోరాటానికి సిద్ధంగా ఉన్నాం సుప్రీంకోర్టు తీర్పుతో నిరాశపడలేదు
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దు సక్రమమేనని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బిజెపి నేతలు హర్షం వ్యక్తం చేస్తుండగా కశ్మీర్‌కు చెందిన నేతలు మాత్రం సుప్రీంకోర్టు తీర్పు తమకు తీవ్ర నిరాశను కలిగించిందని పేర్కొన్నారు. నేషనల్ కా న్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు , రాష్ట మాజీ ముఖ్యమంత్రి ఒమ ర్ అబ్దుల్లా సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.‘ తీర్పుతో అసంతృప్తితో ఉన్నాం. కానీనిరాశపడడంలేదు. ఆర్టికల్ 370ని రద్దే చేయడానికి బిజెపికి కొ న్ని దశాబ్దాలు పట్టింది. మేం కూడా సుదీర్ఘ పోరాటానికి సిద్ధమవుతున్నాం.దీనిపై మా పోరాటం కొనసాగుతుంది’ అని ఒమర్ అబ్దుల్లా ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆశను కోల్పోరాదని పేర్కొంటూ ప్రముఖ కవి ఫౌజ్ అహ్మద్ ఫౌజ్ రాసిన ఓ కవితను కూడా ఆయన ఉదహరించారు.
మేం ఓడిపోయినట్లు కాదు: మెహబూబా
కాగా సుప్రీంకోర్టు తీర్పుతో తాము నిరుత్సాహ పడడం లే దని మరో మాజీ ముఖ్యమంత్రి, పిడిపి అధ్యక్షురాలు మె హబూబా ముఫ్తీ అన్నారు.‘ సుప్రీంకోర్టు తీర్పుకు మేము నిరుత్సాహ పడడం లేదు.ఈ విషయంలో జమ్మూ కశ్మీర్ ఎన్నో ఒడిదుడుకులను చూసింది. 370 నిబంధన తాత్కాలికమన్న వ్యాఖ్యలతో మేము ఓడిపోయినట్లు కాదు. ఇది భారత దేశ ఆలోచనల ఓటమి.ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ జైలులా మారింది. దుకాణాలు ఉదయం 10 గంటల వ రకు తెరవొద్దని ఆదేశించారు. మేమంతా గృహనిర్బంధం లో ఉన్నాం. ఏళ్లనుంచి కొనసాగుతున్న యుద్ధమిది. మే ము ఇక్కడినుంచి వెళ్లం. మేమంతా కలిసి పోరాడుతాం’ అని ఎక్స్‌లో పోస్టు చేసిన ఓ వీడియయోలో మెహబూబా ముఫ్తీ అన్నారు. కాగా సుప్రీంకోర్టు తీర్పు చాలా విచారకరం, దురదృష్టకరమైనదని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూ డా అయిన గులాం నబీ ఆజాద్ అన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించాల్సిందేననిఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై జమ్మూ కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలను సంప్రదించి ఉంటే తాము ఎంతో కొంత బేరమాడి ఉండే వాళ్లమని అలా చేయకుండా హడావేడిగా దీన్ని రద్దు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News