Friday, January 24, 2025

బస్టాండ్‌లో ఏడు పిండాల అవశేషాలు

- Advertisement -
- Advertisement -

Aborted fetuses found in Belagavi

 

బెంగళూరు: ఓ డబ్బాలో పిండాల అవశేషాలు కనిపించిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో జరిగింది. ముదలగి పట్టణం సమీపంలోని ఓ బస్టాప్‌లో డబ్బా కనిపించడంతో స్థానికులు తెరిచి చూశారు. డబ్బాలో ఏడు పిండాల అవశేషాలు బయటపడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఆ డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. అవాంఛిత గర్భం రావడంతోనే గర్భస్రావం చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పిండాలను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రిలో భద్రపరిచామని పోలీసులు పేర్కొన్నారు. ఐదు నెలలు నిండిన పిండాలేనని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రైవేటు ఆస్పత్రులే అవాంఛిత గర్భాలను తొలగిస్తున్నాయని స్థానికులు వాపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News