Thursday, January 23, 2025

యాదవుల డిమాండ్లను నెరవేరిస్తేనే ఓట్లెస్తాం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/తూప్రాన్‌ః యాదవ కులస్థుల అనైక్యతను అసరాగా చేసుకుని అగ్రకులస్థులు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా విద్యాపరంగా ఎదగకుండా అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని, యాదవులంతా సంఘటితమైతేనే అన్ని రంగాలలో ఎదుగుదల సాద్యమవుతుందని యాదవహక్కుల పోరాట సమితి జాతీయ అద్యక్షుడు మేకల రాములు యాదవ్ పేర్కొన్నారు. తూప్రాన్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో గురువారం ఏర్పాటైన మెదక్ జిల్లా నూతన అద్యక్షుడుగా నియామకం అయిన ఆబోతు వెంకటేశ్ యాదవ్ పదవి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కుర్మలు ఆర్థికంగా ఎదుగుదల కోసం తక్షణమే యాదవకార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ప్రతి యేడాది బడ్జెట్‌లో 5వేల కోట్ల రూపాయలను కేటాయించాలని, 1970లో ఏర్పాటు చేసిన కాకా కలేకర్ కమిషన్‌ని వేదిక ప్రకారం అర్థసంచార జాతులకు రిజర్వేషన్లను అమలు చేయాలని, రాష్ట్రంలో గొల్లకుర్మలకు రెండో విడతగొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే పూర్తిచేయాలని రాములు యాదవ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు.

రాష్ట్ర జనాభాలో 20శాతం ఉన్న గొల్ల కుర్మ కులస్థులకు రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జనాబా ప్రాతిపదికన ప్రదాన రాజకీయ పక్షాలు యాదవులకు సీట్లను కేటాయించాలని, సీట్లనుకేటాయించేరాజకీయ పార్టీలకే యాదవుల మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చి 80 యేళ్లు అవుతున్న యాదవులు అన్ని రంగాలలో ఇంకా వెనుకబడి ఉన్నారని రాములు యాదవ్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు యాదవ కులస్థులను ఓట్ల కోసమే వాడుకుంటున్నారే తప్ప వారిని రాజకీయంగా ఆర్థికంగా ఎదగనివ్వడం లేదని ఆరోపించారు. స్వాతంత్య్రం నుంచి ఇప్పటివరకు మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క ఎమ్మెల్యే కూడా యాదవ కులస్థులు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు.

యాదవ కులస్థులు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. యాదవ కులస్థులు సంఘటితమైతేనేరాజకీయపార్టీలకు కనువిప్పు కలుగుతుందని, డిమాండ్లను నెరవేర్చిన పార్టీకే మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. యాదవుల సమస్యల కోసం పోరాడినందుకు తనపై ఇప్పటివరకు 68 కేసులు ఉన్నాయని అయినా తాను ఎవరికి బెదిరేది లేదని, యాదవుల జాతి కోసం తానురాజీలేని పోరాటం సాగిస్తూనే ఉంటానని పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో యాదవులు సంఘటితమై తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.మెదక్ జిల్లా కమిటీకి కొత్తగా నియమితులైన అద్యక్షుడు ఆబోతు వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ యాదవులసమస్యల పరిష్కారం కోసం తాను ఎల్లవేళలా పనిచేస్తానని అందుకు తనకు జిల్లాలోని యాదవ కులస్థులు సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అంజయ్య యాదవ్, తూప్రాన్ పట్టణ యాదవ సంఘం అద్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, దుర్గరాజు యాదవ్, నాగరాజు యాదవ్ తదితర యాదవ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News