- Advertisement -
బీజింగ్: కొవిడ్19తో ఆస్పత్రులపాలై కోలుకున్నవారిలో సగంమందిలో ఏడాది వరకు ఏదో ఒక సమస్య కనిపిస్తోందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. చైనాలోని వుహాన్‌లో 1276మంది పేషెంట్లపై నిర్వహించిన అధ్యయన నివేదికను ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ శుక్రవారం ప్రచురించింది. 2020 జనవరి 7 నుంచి మే 29వరకు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన పేషెంట్లపై చైనాజపాన్ ఫ్రెండ్‌షిప్ హాస్పిటల్ వైద్యులు ఈ అధ్యయనం నిర్వహించారు. పేషెంట్లలోని ముగ్గురిలో ఒకరు శ్వాస సమస్యతో బాధపడటం, మరికొందరిలో ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తడం గుర్తించామని వైద్యులు తెలిపారు. కొవిడ్ బారిన పడనివారితో పోలిస్తే వీరిలో ఆరోగ్య పరిస్థితి బలహీనంగా ఉన్నదని వారు పేర్కొన్నారు. ఇదే బృందం గతంలోనూ 1733మంది పేషెంట్లపై అధ్యయనం జరిపింది. ఆ నివేదిక ప్రకారం నాలుగింట మూడొంతులమందిలో ఆరు నెలల తర్వాత కూడా సమస్యలు కనిపించాయి.
- Advertisement -