Saturday, January 4, 2025

మహిళా తేజం ఆరుట్ల కమలాదేవి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు, స్వాతంత్ర సమరయోధురాలు ఉన్నత ఆశయాలు కలిగిన కమ్యూనిస్టు, ఆంధ్ర రాష్ట్ర మహిళా ఉద్యమ నిర్మాణంలో నిరంతర కృషి చేసిన ‘ధీర వనిత‘ నిజాం పాలనను అంతమొందించుటకు జరిగిన పోరాటంలో నిస్వార్ధంగా, అంకితభావంతో పోరాటం వీర వనిత ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల కమలాదేవి యాదాద్రి జిల్లా, ఆలేరు మండలం, మంతపురి గ్రామంలో పుట్టింది. తల్లిదండ్రులు ఆమెకు రుక్మిణి అని పేరు పెట్టారు. మధ్యతరగతి రైతు కుటుంబం వారిది. అది నిజం పాలనలో పౌర హక్కులకు స్వేచ్ఛ లేని కాలం మూడవిశ్వాసాలు కులం మతతత్వం అంటరానితనం వ్యవస్థని శాసిస్తున్న రోజులవి, పల్లెటూర్లలో పాఠశాలలు ఉండేవి కావు ఊహించడం కూడా తప్పే, అటువంటి కాలంలో భర్త రామచంద్ర రెడ్డి, కమలాదేవిని చదివించాలని అనుకున్నాడు.

కమలాదేవి మాడపాటి హనుమంతరావు, నెలకొల్పిన బాలికల పాఠశాలలో చేరింది. అక్కడే బాలికల హాస్టల్ లో కమలదేవి ప్రథమ విద్యార్థిగా ప్రవేశించింది. పట్టుదలతో చదివి మెట్రిక్ పూర్తి చేసింది.విద్యాతో పాటు రాజకీయాలు అర్థం చేసుకుని మహిళా ఉద్యమాలలో పాల్గొని అప్పుడే తెలంగాణలో నిజాం పాలన ఉండేది, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఆలోచనల ప్రకారం నిజాం పాలన సాగేది. సంస్థానాధీశులు, దేశ్ ముఖ్ లు లక్షల ఎకరాల భూమిని తాము ఆధీనంలో ఉంచుకునేవారు, భూస్వాములు గ్రామీణ పెత్తందార్ల కింద గ్రామ ప్రజలు, రైతులు కష్టాలు పడ్డారు. అన్ని కులాల వారు అణిగి ఉండాల్సిందే. వెట్టిచాకిరి పేరుతో ప్రతిఫలం లేకుండా భూస్వాములు ఇండ్లలో పని చేయాలి. తెలుగు భాషలో చదువుకునే అవకాశాలు లేవు పాఠశాలలు,గ్రంథాలయాలు స్థాపనకు అడ్డంకులు ఉండేవి. ఇట్లాంటి గోసను కమలాదేవి సహించలేకపోయింది.

వంటశాల పేరుతో తలుపులు, కిటికీలూ లేని స్థలంలో విద్యార్థులను పోగు చేసి కమలాదేవి బడిని, గ్రంథాలయాన్ని నడిపింది. తెలంగాణలో ప్రజోద్య మజ్వాలాలు. ఆంధ్ర మహాసభ ఒక ఉద్యమంగా రూపొందుతున్న సందర్భం. ఇటువంటి సమయంలో స్త్రీలకు ఆత్మ రక్షణ అవసరమని భావించింది కమలాదేవి. ‘మహిళ ఆత్మ రక్షణ‘ శిబిరంలో సైనిక శిక్షణ పొందింది. భర్తతోపాటు తెలంగాణ సాయుధ సమరంలో అడుగు పెట్టింది. పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నది. చల్లూరు గుట్టలో జరిగిన చారిత్రాత్మక పోరాటంలో ఆపరాకళివలె విజిరింబించింది. కమలాదేవి పోరాటంలో జబ్బు చేసింది, ఆసుపత్రికి తీసుకెళ్తుండగా నిజాం పోలీసులు కమలాదేవి అరెస్టు చేశారు. వరంగల్, ఔరంగాబాద్,సికింద్రాబాద్ లో జైలు శిక్షను అనుభవించింది.

జైలలోను హక్కుల కోసం పోరాడిన ధీశాలి భూస్వాముల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన విప్లవ యోధురాలు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎగిసిన అగ్నిజ్వాల, 1952 మొదటి సాధారణ ఎన్నికల్లో ఆలేరు నుండి అత్యధిక ఓట్లు మెజారిటీతో శాసనసభకు ఎన్నికయింది. స్వతంత్ర భారతదేశంలోని రాష్ట్రంలో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకురాలుగా చరిత్ర సృష్టించింది. ప్రజల దైవానందిన సమస్యల అసెంబ్లీ లోపల బయట క్రియాశీలకంగా పోరాడింది. కమలాదేవికి 1998లో కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. కమలాదేవిది సహృదయం సత్య అన్వేషి ఆమె, కష్టాల నుండి శాశ్వత విముక్తిని సాధించే వరకు నిద్రపోని వ్యక్తిత్వం ఆమెది, తెలుగు మహిళలకు వెలుగు బాట చూపిన పుణ్యమూర్తి గొప్ప మానవత వాది కమలాదేవి.జనవరి 1వ తేది 2001న ఈలోకం విడిచింది.
ఆరుట్ల కమలాదేవి వర్ధంతి, జనవరి 1,సందర్బంగా..

దేవులపల్లి రమేశ్, సిద్దిపేట జిల్లా, 9963701294

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News