మోకాలి లోతు తవ్వకాలకే
ఉప్పొంగిన గంగ చెరువు
పునరుద్ద్ధరణకు హైడ్రా చర్యలు
మన తెలంగాణ/సిటీబ్యూరో: బతుకమ్మ కుంట బతికే ఉంది. మోకాలి లోతు మట్టి తవ్వగానే గం గమ్మ ఉబికి పైకి ఉప్పొంగింది. అది చెరువే అనే ది రుజువైంది. ఇక అది చూసిన స్థానికులు ఆనం దం పెల్లుబికింది. బతుకమ్మకుంట చెరువని, ప్రైవేట్ భూమి కాదనేది ఉబికి పైకి వచ్చిన నీరే తే ల్చేసింది. ఇది అంబర్‌పేట్ పరిధిలోని బతుకమ్మకుంటలో మంగళవారం చోటుచేసుకున్న సం ద ర్భం. బతుకమ్మకుంట కాదు.. ఇది మా స్థలమం టూ ఇప్పటి వరకు నమ్మబలికిన వారు ఇప్పుడేమంటారని అక్కడి స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కబ్జాల చెరతో ఆనవాళ్ళను కోల్పోయిన చెరువు కు ప్రాణం పోయమని, చెరువును బతికించి భవిష్యత్తు తరాలకు అందించాలని స్థానికులు ‘హైడ్రా’ను ఆశ్రయించిన నేపథ్యంలో అధికారులు రంగ ప్రవేశం చేసి బతుకమ్మకుంట
ప్రాంతంలో ని చెట్ల పొదలను తొలగించేందుకు తవ్వకాలు జ రపగానే కబ్జాదారుల పూడికతో కప్పబడిన గం గమ్మ ఉబికి పైకి వచ్చింది. హైడ్రా అధికారులకు స్వాగతం పలికింది. గత కొన్ని దశాబ్థాలుగా నిం పిన మట్టిని మొత్తం తొలగిస్తే చెరువు నిండా నీటి తో కళకళలాడుతుందని స్థానికులు స్పష్టంచేస్తున్నారు. ఇది తమ భూమి అని కొందరు హైకోర్టు ను ఆశ్రయించగా కింది కోర్టుకు వెళ్ళాలని సూ చించినది విధితమే. నాటి నుంచి బతుకమ్మ కుం టను చెరువేనని చూపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టి అక్కడి పూడికతో వెలిసిన చెట్ల పొదలను, ఇతర వ్యర్థాలను మోకాలిఊలోతుకు తవ్వి తొలగిస్తుండగానే నీరు పైకి రావడంతో అది చెరువుకు ఆనవాళ్ళని స్పష్టంగా తెలుస్తున్నట్టు హైడ్రా అధికారులు వెల్లడించారు.
చెరువు చిత్రం ఇది..
అంబర్‌పేట్ మండల పరిధిలోని బాగ్ అంబర్‌పేట్ ప్రాంతంలో సర్వే నెంబర్ 563లో 196263 లెక్కల ప్రకారం మొత్తం 14.06 ఎకరాల విస్తీర్ణంతో బతుకమ్మకుంట చెరువు ఉన్నట్టు హైడ్రా అధికారులు పేర్కొంటున్నారు. బఫర్‌జోన్‌తో కలిపి చెరువు పూర్తి విస్తీర్ణం 16.13 ఎకరాలుగా సర్వే అధికారులు వెల్లడిస్తున్నారు. తాజా సర్వే ప్రకారం అక్కడ మిగిలిన భూమి కేవలం 5.15 ఎకరాల విస్తీర్ణం మాత్రమే ఉందని, ఈ 5.15 ఎకరాల భూమిలో చెరువును పునరుద్దరించాలని హైడ్రా నిర్ణయించినట్టు కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ప్రస్తుతం స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా..చెరువు పూడికను తొలగించి చెరువుకు కొత్త అందాలను తీసుకురావాలనే దిశగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
ఒకప్పటి ఎర్రకుంటనే కాలక్రమంలో బతుకమ్మకుంటగా మారిందన్న స్థానికులు.. రెవెన్యూ రికార్డులు కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో బతుకమ్మకుంటలో చెత్త, నిర్మాణ వ్యర్థాలు పారపోయడంతో చెరువు కాస్త కుచించుకుంటూ పోయి చెరువు ఆనవాళ్ళను కోల్పోయిందని హైడ్రా భావిస్తున్నట్టు వెల్లడించారు. ఈ చెరువును పునరుద్దరించడంతో పాటు సుందరీకరణ చేపడితే.. స్థానికులకు ఆహ్లాదకర వాతావరణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని బోరుబావుల్లోని భూగర్భజలాలు పెరుగుతాయని అధికార వర్గాలు ధీమా వ్యక్తంచేస్తున్నాయి.
జలమండలి వివరణ..
బతుకమ్మకుంటను పునరుద్ద్ధరించడంలో భాగంగా హైడ్రా చేపట్టిన తవ్వకాలలో పైకి ఉబికి వచ్చిన నీరు పైపులైన్ ద్వారా వచ్చిందేనన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ నీటిపై జలమండలి అధికారులు వివరణనిచ్చారు. బతుకమ్మకుంటలో వచ్చిన నీరు పైపులైన్ లీకేజీ ద్వారా వచ్చింది కాదని, ఆ తవ్వకాలకు జలమండలి పైపులైన్ 150 మీ.ల దూరంలో ఉన్నట్టు అధికారులు స్పష్టం చేశారు.