Thursday, November 21, 2024

ముగ్గుల్లో సూక్ష్మసారం

- Advertisement -
- Advertisement -

Sankranthi Muggulu

 

చిమ్మని చీకటి. రవి నిద్ర లేవడానికి ఇంకా సమయముంది. గజగజ వణికించే చలి కాలం.ఐనా తెలుగింటి ముంగిలిలో హడావిడి ఉంది. ఆడవాళ్లందరూ తమ వాకిటి ముందు శుభ్రం చేసి కళ్లాపు జల్లి అందమైన ముగ్గులు పెట్టడంలో మునిగిపోయి ఉన్నారు. అయినా ఇంత చలిలో, చీకటిలో లేచి ఇంటిముందు ముగ్గులు పెట్టడం ఎందుకంట?? కాని ఈ దృశ్యం చూసిన వారందరికీ అర్ధమైపోతుంది సంక్రాంతి నెల వచ్చేసిందని. సంక్రాంతి పండగకు నెల రోజుల ముందుగానే ఇంటి ముంగిళ్లను అందమైన రంగవల్లులలో అలంకరించడం స్త్రీలకు గల ప్రత్యేకమైన ఆసక్తి, కళాదృష్టికి నిదర్శనం. పట్టణాలలో ఈ దృశ్యం అఫురూపమే అనొచ్చు కాని కొన్నేళ్ల క్రితం పల్లెల్లో, పట్టణాల్లో సంబరంగా ఉండేది.

Sankranthi Muggulu

ముగ్గు అనేది చుక్కలు పెట్టి గీతలు గీయడం కాదు. అది ఒక కళ, ఒక శాస్త్రం, భారతీయులకే సొంతమైన అందమైన చిత్రకళ. భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో హిందువుల ఇళ్లలో, దేవాలయాలలో, నాట్యప్రదర్శనలు, పండగ రోజులలో ఈ ముగ్గుల అలంకరణ తప్పనిసరిగా చూడవచ్చు. తెలుగువాళ్లు ముగ్గు అని, తమిళులు కోళం అని, కన్నడిగులు రంగవల్లి అని, కేరళలో పూక్కళం లేదా పూవిడల్ అని, మధ్యప్రదేశ్‌లో చౌక్‌పూర్ణ, ఉత్తర్‌ప్రదేశ్‌లో లిఖ్నూ సోనా అని, గుజరాత్‌లో సథియా అని పిలవబడుతుంది. ఈ ముగ్గుల పూర్వచరిత్ర గురించి తెలుసుకుంటే ఇది చాలా పురాతనమైనది. సింధు లోయలోని శిథిలాలలో హరప్పాలో ఇప్పటి మెలిక ముగ్గుల వంటి చిత్రాలను కనుగొన్నారు. ఎన్నో పురాతన ఆలయాల లోని స్తంభాలపై కూడా ముగ్గులను చూడవచ్చు. దానికి తమిళనాడులోని ఇప్పటి కరూర్‌ప్రాతంలో పదవ శతాబ్దంలో చోళరాజులు నిర్మించిన పశుపతీశ్వర ఆలయపుశిల్పాలే నిదర్శనం. దక్షిణ చెన్నైలోని తిరువాణ్మై అనే ఊరిలో ఉన్న మరుందీశ్వరర్ (ఓషధీశ్వరుడు) గుడిలో కూడ మూడు త్రిభుజాలతో మెలిక ముగ్గులాటి శిల్పం ఒకటుంది.

Sankranthi Muggulu

ఇది కాక ఈజిప్టు, గ్రీకు శిల్పాలలో సెల్టిక్ ముడులలో మెలిక ముగ్గులను పోలిన చిత్రాలు ఉన్నాయి. అంతేకాదు మన తెలుగు సాహిత్యంలో కూడా ముగ్గుల గురించిన ప్రస్తావన ఉంది. క్రీడాభిరామం, ఆముక్తమాల్యద , విజయవిలాసం గ్రంధాలలో వీటి ప్రసక్తి వచ్చింది.  సూర్యుడు పన్నెండు రాశులలోనికి క్రమంగా సంక్రమణం చేస్తూ ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి సంక్రమణం చేసినప్పుడు దాన్ని సంక్రాంతి పండగ అని పెద్ద పండగ జరుపుకుంటాం. ప్రత్యేకంగా సంక్రాంతి అంటే ముగ్గుల పండగ అని ప్రసిద్ధి. ఈ సంక్రాంతి సమయంలో వేసే ముగ్గులకు కూడా ఒక విశిష్టమైన అర్ధం, పరమార్ధం ఉంది. ఆకాశంలో ఏ నక్షత్రం ఎక్కడ ఉంటుందో, ఏ నక్షత్రానికి ఎటుపక్క ఏయే గ్రహాలు ఉంటాయో, ముఖ్యంగా సూర్యుని చుట్టూ ఆ గ్రహాలు తిరుగుతుంటాయో చెప్పే అద్భుత ఖగోళ పాఠమే ముగ్గు. శుభ్రం చేసి నీళ్లు చల్లిన నేల ఆకాశం కాగా దాని మీద పెట్టిన ప్రతీ చుక్కా ఆ తారా మండలంలోని నక్షత్రానికి సంకేతం.

Sankranthi Muggulu

ఆ నక్షత్రాలను(చుక్కలను) చుడుతూ సన్నగా గీయబడే ప్రతీ గీతా ఏ నక్షత్రాన్ని ఏ దృష్టితో ఎటువైపు మొదలుపెట్టి ఎటు వైపు వెళ్లాలో, అన్నింటికి మధ్యలో ఉన్న చుక్క సూర్యు డికి ఈ నక్షత్రాలన్నీ ఎంత దూరంలో ఉన్నాయో తెలిపే సూక్ష్మసారం. అందుకే పెద్దలు నక్షత్రాలను చుక్కలు అని కూడా అంటారు.  రథం ముగ్గు ప్రత్యేకత సంక్రాంతి నెలలోని ప్రతీరోజు వేసే ముగ్గు కాకుండా చివరి రోజు అంటే కనుమనాడు వేసే రథం ముగ్గుకు కూడ ఒక ప్రత్యేకమైన అర్ధం ఉంది. నెలరోజులనుండి రోజొక అందమైన ముగ్గుతో ముంగిలిని అలంకరించి చివ రిరోజు మాత్రం అందరూ తమ వాకిలి ముందు రథం ముగ్గు వేసి దానికి సన్నని తాడులాంటి గీత గీసి పక్కింటివారి రథం ముగ్గుకున్న గీతకు కలు పుతారు. అన్ని రథాలను కలుపుతూ ఆ గీత చివరికి స్మశానం వరకు గీయబడుతుందని అంటారు. ప్రతీ మనిషి ఒక రథం వంటివాడు. అది ఎంత అందంగా, ఆడంభరంగా, గొప్పగా వెళ్ళినా చివరికి చేరేది మరు భూమియే కాబట్టి అందరూ మంచిగా ఉండాలని తెలియచేస్తుంది ఈ ముగ్గు.

Sankranthi Muggulu

ప్రతీ మనిషి ఒక రథం వంటివాడు. అది ఎంత అందంగా, ఆడంబరంగా, గొప్పగా వెళ్ళినా చివరికి చేరేది మరు భూమియే కాబట్టి అందరూ మంచిగా ఉండాలని తెలియచేస్తుంది ఈ ముగ్గు. సంక్రాంతినాడు ఇంటిముందు రంగులతో అలంకరించిన ముగ్గు మధ్యలో ఆవుపేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను కూడా పెడతారు. దానికి పసుపు, కుంకుమతో బొట్లుపెట్టి, బంతిపూలతో అలంకరిస్తాను. నాలుగు ఒకే సైజులో ఉన్న గొబ్బెమ్మలు, మధ్యలో మాత్రం కాస్త పెద్ద గొబ్బెమ్మను పెడతారు. అసలు ఈగొబ్బెమ్మలు పెట్టడం వెనుక ఉన్న మర్మం తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. గోపి+బొమ్మ = గొబ్బెమ్మ… గోపి లేదా గోపికలు శ్రీకృష్ణుని మనస్ఫూర్తిగా ప్రేమించి అతనే సర్వాంతర్యామి అని భావించి అతనిలోనే ఐక్యం అవ్వాలి, మోక్షం పొందాలి అనే ధృడాభిప్రాయం ఉన్న కాంతలు. శ్రీకృష్ణుడు తన భర్తయని నమ్మి, అతను తప్ప వేరే ధ్యాస లేని మహాభక్తురాలు గోదాదేవి. శ్రీరంగనాధుని వలచి అతనిని పెళ్లి చేసుకున్న భక్తురాలు. ఈ గొబ్బెమ్మలలో నాలుగువైపులా ఉన్నవి ఆ గోపకాంతలు, మధ్యలోఉన్న పెద్ద గొబ్బెమ్మ ఆండాల్ లేదా గోదాదేవి అని పెద్దలు చెబుతారు.

Sankranthi Muggulu

ముగ్గుల వెనుక మరో కోణం యజ్ఞ యాగాదుల్లో దేవతలను ఆహ్వానించేందుకు మండలం అని రంగురంగుల్లో ముగ్గు వేస్తారు. ఇది బౌద్ధమతంలో కూడా ఉన్నది. ఆ మధ్యన అమరావతిలో జరిగిన ఉత్సవాలలో కూడా బౌద్ధ పండితులు వేసిన మండపం సర్వతోభద్ర మండలాన్ని పోలి ఉన్నది. ఇది చలికాలం. దక్షిణాయనం.

సూర్యుడికి భూమికి మధ్య దూరం పెరిగిపోవడం, మంచు వల్ల భూమి వచ్చే సూర్యకిరణాల ప్రభావం తక్కువగా ఉంటుంది.అందువల్ల రోగాలు త్వరగా వ్యాపిస్తాయి. సూర్యు డి నుంచి వచ్చే సూర్యకిరణాల్లో 7 రకాల రంగులు మన శరీరంలోని 7 చక్రాల (నాడీ కేంద్రాలు) మీద ప్రభావం చూపిస్తాయి. రంగులు మానవ మనసుపై ప్రభావం చూపిస్తాయని, వివిధ రకాలా మానసిక, శారీరిక రోగాలున్నవారిని కొన్ని రంగులకు ప్రభావితం చేయడం వలన, వారి ఆరోగ్య పరిస్థితిలో మార్పు తీసుకురావచ్చని ఆధునిక వైద్యశాస్త్రం గుర్తిస్తోంది. ఇదే అంశాన్ని మనవాళ్ళూ ఎన్నో యుగాలకు ముందే తెలుసుకుని, ఆచరణలో పెట్టారు.

Sankranthi Muggulu

రంగులను ముగ్గులలో వేయడం వల్ల వాటి మీద పడ్డ సూర్యకిరణాలు పరావర్తనం చెంది శరీరం మీద పడతాయి. ఆ కిరణాలను శరీ రం గ్రహించడం ద్వారా రోగనిరోధక శక్తి కోల్పోం. ప్రకృతి మార్పులవల్ల కలిగే బద్ధకాన్ని తొలగించడానికి మన ప్రాచీనులు కనిపెట్టిన కలర్ థెరపీ ఈ రంగవల్లులు. ఆచారాలు, సంప్రదాయాలేమీ ఊరికినే రాలేదు. వాటి వెనుక ఆరోగ్య సూత్రాలు, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుని, గుర్త్తు పెట్టుకుని పాటిస్తే విసుగనేది ఉండదు మరి..

 

about Sankranthi Muggulu in Telugu

జ్యోతి వలబోజు

8096310140

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News