Sunday, November 3, 2024

ఉగాది ఎలా మొదలైందంటే…!

- Advertisement -
- Advertisement -

బ్రహ్మ ప్రళయం పూర్తైన తరువాత తిరిగి సృష్టి ప్రారంభమయ్యే సమయాన్ని ’బ్రహ్మకల్పం’ అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభసమయాన్ని ‘ఉగాది‘ గా వ్యవహరిస్తారు. ’ఉగాది’ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణిస్తాం. పురాణాల ప్రకారం ఉగాదికి అసలు పేరు యుగాది. అంటే యుగానికి ఆరంభమని అర్థం. ఉగాది అనే పేరులో ‘ఉగ‘ అనగా నక్షత్ర గమనం అని అర్థం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది. అనగా ఈ సృష్టి ఆరంభమైన దినమే ఉగాది పర్వదినంగా పరిగణించబడింది. యుగము అంటే ద్వయము లేక జంట అని కూడా అర్ధం వస్తుంది. వేదాలను హరించిన కారణంగా సోమకుడనే రాక్షసుడిని వధించిన మత్యావతారుడైన విష్ణువు, ఆ వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభ తరుణాన్ని పురస్కరించుకుని ఉగాది పండుగ ఆచరణలోకి వచ్చింది. అదేరోజైన చైత్రశుక్ల పాడ్యమి నాడు ఈ విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. చారిత్రక వృత్తాంతం ప్రకారం చైత్రశుక్లపాడ్యమి అయిన ఉగాదినాడు శాలివాహన చక్రవర్తి పట్టాభిషిక్తుడై శాలివాహన యుగకర్తగా వర్థిల్లిన కారణం కూడా ఉగాది ఆచరించడానికి ప్రధాన కారణమంటారు.

నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి:

ధర్మసింధు కారులు పంచవిధులు సూచించిన విధంగా ఇప్పటికీ భారతీయులు ఉగాది ఆచరణ విధానం శాస్త్రోక్తంగా పాటిస్తారు. ప్రతీ ఒక్కరూ తమ తమ ఇళ్ళు శుబ్రపరుచుకుని తోరణాలతో అలంకరించుకుని, మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో ఇంటిని అలంకరిస్తారు. ఉగాది రోజున వేకువజామునే ప్రతి ఒక్కరూ తైలంతో, కుంకుడితో అభ్యంగన స్నానం చేస్తారు., నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధిగా భావిస్తారు. మహాలక్ష్మిదేవిని నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి ఉంటారని భక్తులు విశ్వసిస్తారు. కాబట్టి స్నానం చేసినట్లైతే లక్ష్మి, గంగా మాతల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. మనిషికి చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు.. ప్రాణులన్నీ కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News