Monday, December 23, 2024

రేపు చెన్నైకి ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత గురువారం నాడు చెన్నైలో పర్యటించనున్నారు. ఎబిపి నెట్‌వర్క్ సంస్థ నిర్వహించనున్న ‘ద సదరన్ రైసింగ్ సమ్మిట్‘లో కవిత పాల్గొంటారు. ఈ సమ్మిట్‌లో ‘సార్వత్రిక ఎన్నికలు 2024: ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు..?’ అనే అంశంపై గురువారం నాడు రాత్రి 7.30 గంటల నుంచి జరిగే చర్చ వేదికలో పాల్గొని కవిత తన అభిప్రాయాలను తెలియజేయనున్నారు. ఈ అంశంపై జరిగే చర్చలో కాంగ్రెస్ ఎంపి కార్తి చిదంబరం, తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నమలై పాల్గొంటారు. ఈ చర్చా వేదికకు ప్రముఖ రచయిత చేతన్ భగత్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News