Sunday, December 22, 2024

ఆర్టికల్ 370రద్దుపై 11 నుంచి ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి సంబంధిత ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపడుతోంది. ఆర్టికల్ రద్దు విషయంపై దాఖలైన పలు పిటిషన్లపై ఈ నెల 11వ తేదీన ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ నిర్వహిస్తుంది. ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఐఎఎస్ అధికారి షా ఫేజల్ కూడా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు సంచలనాత్మకం అయింది.

అయితే రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ రద్దు సరికాదని దాఖలు అయిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్, సూర్యకాంత్ ధర్మాసనం విచారణ జరుపుతుంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టులో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేశారు.
సుప్రీంకోర్టుకు ముగిసిన వేసవి సెలవులు
పలు కీలక వ్యాజ్యాలకు ఇక విచారణలు?
42 రోజుల వేసవి సెలవుల తరువాత సుప్రీంకోర్టు సోమవారం తిరిగి ప్రారంభం అయింది. వెకేషన్ సెలవుల్లో కేవలం కొన్ని అత్యవసర కేసులే విచారణకు వచ్చాయి. కాగా ఇప్పుడు తిరిగి సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభం కానుండటంతో పెండింగ్‌లో ఉన్న పలు కేసులు విచారణకు రానున్నాయి. ఇందులో అత్యంత కీలకమైన కేసులు కూడా ఉంటాయి. యుపిలో గ్యాంగ్‌స్టర్ల హతం, మణిపూర్‌లో కుకీలకు సైన్యం రక్షణ, ఆర్టికల్ 370 రద్దు, స్వలింగసంపర్కుల వివాహాలకు అనుమతి , బిల్కిస్ బానో కేసు, ఎన్నికల బాండ్ల చెల్లుబాట్లు వంటి పలు కీలక వ్యాజ్యాలు విచారణకు రావల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News