Thursday, January 16, 2025

‘కాంట్ వెయిట్ టు వింటర్’ గ్లోబల్ ప్రచారాన్ని ప్రారంభించిన అబుదాబి టూరిజం

- Advertisement -
- Advertisement -

బుదాబి, సాంస్కృతిక, పర్యాటక శాఖ (DCT అబుదాబి) యొక్క డెస్టినేషన్ బ్రాండ్ – ఎక్స్పీరియన్స్ అబుదాబి ‘కాంట్ వెయిట్ టు వింటర్’ శీర్షికన అంతర్జాతీయ ప్రచారాన్ని ప్రారంభించింది. వెనువెంటనే కార్యక్రమాలతో మరపురాని అనుభూతిని కలిగిస్తూనే, పరిపూర్ణ వాతావరణంతో కలిపి ప్రతి ఒక్కరి ఆసక్తులను తీర్చుకునేలా కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకు రానున్నామనే వాగ్ధానాన్ని ఇది చేస్తుంది.

మీరు సంస్కృతిని ఇష్టపడే వారైనా, క్రీడల అభిమాని అయినా, ఆహార ప్రియులైనా, ఉత్సాహపూరిత అనుభవాలను కోరుకునే వారైనా లేదా సంగీత ప్రియులైనా, అబుదాబి శీతాకాలం కోసం ఆసక్తిగా ఎదురుచూసే వింటర్ లైన్ అప్‌ని రూపొందించింది. అద్భుతమైన ఈ కార్యక్రమాలతో, అస్సలు వదులుకోలేనట్లు గా ‘కాంట్ వెయిట్ టు వింటర్’ అనుభూతిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి.

‘కాంట్ వెయిట్ టు వింటర్’లో భారతీయ సూపర్ స్టార్ రణవీర్ సింగ్, చైనీస్-అమెరికన్ నటి లియు యిఫీ, గల్ఫ్ ప్రాంతంలోని ప్రముఖ హాస్య జంట దావూద్ హుస్సేన్, హసన్ అల్ బల్లం లు అబుదాబిలో సంస్కృతి, సాహసం, విశ్రాంతి, కలినరీ ఆనందాలు, షాపింగ్‌లతో నిండిన ప్రయాణ అనుభవాలను పంచుకున్నారు. NBA అబుదాబి గేమ్స్, ఫార్ములా 1 అబుదాబి గ్రాండ్ ప్రిక్స్, UFC షోడౌన్ వీక్ అలాగే హైప్‌రౌండ్ K-ఫెస్ట్ మ్యూజిక్ ఫెస్టివల్, పాప్ ఆర్టిస్ట్ రాబీ విలియమ్స్ కచేరీలు, గాయకుడు అరిజిత్ సింగ్, హామిల్టన్, డిస్నీ ఆన్ ఐస్ రంగస్థల ప్రదర్శనలు తిరిగి రావడంతో శీతాకాలంలో అబుదాబి క్యాలెండర్ యొక్క ఉల్లాసకరమైన షెడ్యూల్ ఆహ్లాదభరితంగా ఉంటుంది.

ఈ శీతాకాలం ఎడారి డూన్ బాషింగ్, క్వాడ్ బైకింగ్, ఇండోర్ అడ్వెంచర్ హబ్‌లతో ఆనందించడానికి వివిధ రకాల ఉత్సాహ పూరిత అనుభవాలతో పాటుగా CLYMB, Circuit X, Adrenark, Snow Abu Dhabi, కొత్తగా తెరవబడిన సీ వరల్డ్ అబుదాబి థ్రిల్ కోరుకునేవారికి, కుటుంబాలకు ఒకేలా ఉత్సాహాన్ని ఇస్తాయి. స్పూర్తి కోసం వెతుకుతున్న వారు ఐకానిక్ లౌవ్రే అబుదాబిలో కళ, సంస్కృతిలో మునిగిపోవచ్చు, కస్ర్ అల్ హోస్న్, హౌస్ ఆఫ్ ఆర్టిసన్స్‌లో ఎమిరాటీ వారసత్వాన్ని అన్వేషించవచ్చు లేదా జ్ఞానం, సంప్రదాయం కలిసే కస్ర్ అల్ వతన్‌లో అబుదాబి స్ఫూర్తిని కనుగొనవచ్చు. ప్రశాంతత, విశ్రాంతి అనుభవాలను కోరుకునేవారు సాదియత్ బీచ్ క్లబ్‌లో లేదా అబుదాబిలోని అనేక సహజమైన బీచ్‌లలో ఒకదానిలో విశ్రాంతి తీసుకోవచ్చు. మడ అడవుల గుండా సూర్యోదయ కయాకింగ్‌ను ఆస్వాదించండి లేదా నూరై ద్వీపానికి ప్రైవేట్ రిట్రీట్‌తో మరింత ప్రశాంతతను ఆస్వాదించండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News