Wednesday, April 2, 2025

మంత్రి కెటిఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న ఎబివిపి కార్యకర్తలు

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల: రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ శాఖల మంత్రి కెటిఆర్ కాన్వాయ్ ని ఎబివిపి కార్యకర్తలు సోమవారం అడ్డుకున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరుగుతున్న నేపథ్యంలో ఎబివిపి కార్యకర్తలు పేపర్ల లీకేజీకి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ మంత్రి కాన్వాయిని అడ్డుకున్నారు. మంత్రి కెటిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలన్నారు. కాన్వాయిని అడ్డుకున్న కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News