Friday, December 20, 2024

రాష్ట్రవ్యాప్తంగా నేడు విద్యాసంస్థల బంద్ కు ఎబివిపి పిలుపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అఖిల భారత విద్యార్థి పరిషత్(ఎబివిపి) సోమవారం పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చింది. తెలంగాణ‌లోని ప్రభుత్వ స్కూళ్లల్లో మౌళిక వసతుల కల్పనతోపాటు ప్రైవేట్ స్కూళ్లు వసూల్ చేస్తున్న అధిక ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర‌వ్యాప్తంగా ఎబివిపి బంద్ కు పిలిపునిచ్చింది.

ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర‌ నాయకులు శ్రీశైలం వీరమల్ల మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాలలు తెరిచి 20 రోజులు కావస్తున్నా.. పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయలేదని, చాలా పాఠశాలల్లో మౌలిక వసతులు లేవని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో సరైన ఫీజుల విధానం అమలు చేసేందుకు ఫీజు నియంత్రణ కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న‌ బంద్ ను విజయవంతం చేయాలని విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు.

Also Read: మోడీకి ఆర్డర్ ఆఫ్ ది నైల్ అవార్డు ప్రదానం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News